Home » Entertainment » Surekha Vani Daughter Supritha Gives The Clarity Of Her Relation Ship
Entertainment

Supritha : సురేఖా వాణి కూతురు అందరిని పిచ్చోళ్ల‌ని చేసిందిగా.. ప్రేమ‌, పెళ్లి వార్త‌ల‌పై పూర్తి క్లారిటీ ఇదే..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 30, 2022, 4:30 pm
Advertisement

supritha : వెండితెర‌పై స్పెష‌ల్ క్యారెక్ట‌ర్స్ పోషించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టి సురేఖా వాణి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ క్రేజ్ పెంచుకుంటున్న సురేఖా వాణి త‌న కూతురితో తెగ ర‌చ్చ చేస్తుంటుంది. వీరిద్ద‌రు చేసు ర‌చ్చ‌కి సోష‌ల్ మీడియా షేక్ అయిపోతూ ఉంటుంది. సురేఖా కూతురు సుప్ర‌త ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర‌స్ ఫొటోలు, వీడియోల‌తో ఇద్ద‌రూ హ‌ల్ చ‌ల్ చేస్తుంటారు. వీరు చేసే ప‌నికి కొంద‌రు ట్రోల్ చేసినా, వీరివురూ త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేసుకుంటూ పోతున్నారు. రీసెంట్‌గా సుప్రిత పెట్టిన ఓ పోస్ట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.‘అవును త‌న ప్రేమ‌కు ఓకే చెప్పాను’ అని చెబుతూ, ఓ అబ్బాయితో ఉన్న ఫొటోను సుప్రిత పోస్ట్ చేసింది.

Advertisement

దీంతో అతడి గురించి ఆరాలు తీసారు. సుప్రితతో ఉన్న అబ్బాయి పేరు.. రాఖీ జోర్డాన్. త‌ను ర్యాప‌ర్‌. ఆల్బ‌మ్స్ చేస్తూ వాటిలో న‌టిస్తూ ఉంటారు. రీసెంట్‌గా రాఖీ జోర్డాన్, సుప్రిత క‌లిసి ఓ ప్రైవేట్ వీడియో ఆల్బ‌మ్‌లో న‌టించారు. వీరిద్ద‌రు త్వ‌ర‌లో ఒక్క‌టి కానున్నారంటూ సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో సుప్రిత తాజాగా స్పందించింది. ‘నా పెళ్లి గురించి విషయాన్ని ఏదైనా మా అమ్మగారే అధికారికంగా చెబుతారు. సాంగ్ ప్రమోషన్స్‌లో భాగంగానే నేను యాక్ట్ చేశాను. అంద‌రూ నాకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటున్నావా? అని అడుగుతున్నారు. నేనేం పెళ్లి చేసుకోవ‌డం లేదు.

surekha vani daughter supritha gives the clarity of her relation ship

Advertisement

supritha : పెద్ద షాకిచ్చిందిగా..!

నా పెళ్లి వార్త ఇంత వైర‌ల్ అవుతుంద‌ని అనుకోలేదు. అంద‌రూ నాకు ఫోన్స్ చేశారు. నేను ప్రేమ‌లో కూడా లేను. సోష‌ల్ మీడియాలో, ఎల‌క్ట్రానిక్ మీడియాలో నా పెళ్లి వార్త వైర‌ల్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేశారు. కొంద‌రు పాజిటివ్‌గానే స్పందించారు. నెగ‌టివ్‌గా స్పందించిన వారికి నేను చెప్పేదొక్క‌టే.. పెళ్లి అనేది నా వ్య‌క్తిగ‌త విష‌యం. నేను ఏంట‌నే విష‌యం మా అమ్మ‌కు, స్నేహితుల‌కు తెలుసు. రేపు న‌న్ను పెళ్లి చేసుకోబోయే వ్య‌క్తికి తెలిస్తే చాలు’’ అన్నారు.మొత్తానికి ఒక్క పోస్ట్‌తో అంతా తూచ్ అని తేలిపోయింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి