Home » Entertainment » Surekha Vani Daughter Supritha Love Story
Entertainment

Supritha : ఆ అబ్బాయి తో సురేఖ వాణి కూతురు సుప్రీత లవ్ స్టోరీ ??

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 12, 2023, 5:00 pm
Advertisement

Supritha : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది నటి సురేఖ వాణి. చాలా సినిమాలలో హీరో హీరోయిన్లకు అక్కగా, వదినగా, అమ్మగా, అత్తగా పాత్రలు చేసి మంచి పేరును సంపాదించుకుంది. ఎన్నో ఏళ్ళుగా సినిమాలో నటించిన సురేఖవాణి ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో కనిపిస్తుంది. ఇక సురేఖ వాణి అయిదు పదుల వయసు దాటినప్పటికీ హీరోయిన్లకు మించిన అందం ఆమె సొంతం. ఆమె వేసే డ్రెస్సులు హీరోయిన్స్ కూడా వేయరేమో. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి కూడా గురి అయింది. ముఖ్యంగా తన భర్త చనిపోవడంతో చాలామంది

Advertisement

surekha vani daughter Supritha Love story

ఆమె డ్రెస్ పై రకరకాల కామెంట్లు కూడా చేశారు.అయితే తాజాగా జీ తెలుగులో రెండు ప్రేమ మేఘాలు అనే షో ఆదివారం రోజు రానుంది. ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. అయితే ఈ ప్రోమోలో యూట్యూబర్ నిఖిల్ సింహ, సురేఖ వాణి కూతురు సుప్రీత ఇద్దరు ప్రేమికులుగా కనిపించారు. దీంతో వీళ్లిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ వివిధ రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించిన యాంకర్ ప్రదీప్ వీరిద్దరిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రదీప్ మాట్లాడుతూ మీరిద్దరు ఎప్పుడు, ఎక్కడ కలిశారు అని అడిగాడు.

Advertisement

surekha vani daughter Supritha Love story

దీనికి బదులుగా వాళ్ళు మేమిద్దరం కరోనా లాక్ డౌన్ లో కలిసాము అని అన్నారు. దీంతో వీళ్లిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారని అందరూ భావిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉందా లేక షో కోసం ఇలా కలిసి వచ్చారా అనేది షో వచ్చేవరకు వెయిట్ చేయాలి. ఇప్పటికే సురేఖవాణి మరియు సుప్రీతాలు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతున్నారు. కానీ ఈ రూమర్లను వీళ్ళిద్దరూ ఏమాత్రం పట్టించుకోకుండా బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే సురేఖవాణి కూతురు ఇండస్ట్రీలో హీరోయిన్గా అంటూ అడుగు పెట్టబోతుందని రకరకాల వార్తలు వస్తున్నాయి. వీటిపై ఇంతవరకు ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి