Samantha : చై-సామ్ విడాకులపై సురేఖా వాణి ఎమోషనల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 3 October 2021, 3:10 pm

Samantha నాగ చైతన్య సమంత విడాకుల విషయాన్ని విని కొంత మంది సంబరపడుతున్నారు. ఇంకొందరు మాత్రం విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. భార్యభర్తల పర్సనల్ విషయాలు అంటూ ఇంకొందరు ఎలాంటి రియాక్షన్ ఇవ్వడం లేదు. కానీ చై సామ్ జోడిని ఇష్టపడే వారు మాత్రం తెగ ఫీలవుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది సెలెబ్రిటీలు బాహాటంగానే స్పందిస్తున్నారు. ఇలాంటిది జరగకుండా ఉండాల్సింది అంటూ ట్వీట్, పోస్ట్‌లు చేస్తున్నారు.

Surekha Vani Gets Emotional On Samantha Naga Chaitanya Divorce

Surekha Vani Gets Emotional On Samantha Naga Chaitanya Divorce

ఈ క్రమంలోనే నటి కస్తూరి శంకర్ కూడా ట్వీట్ వేసింది. సమంత, నాగ చైతన్య విడిపోయి ఉండాల్సింది కాదు. ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ గుండెబద్దలైందంటూ రెండు ముక్కలైన హార్ట్ ఎమోజీని షేర్ చేసింది. అయితే నాగార్జున కూడా ఓ ట్వీట్ వేశాడు. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందనే మనకు తెలియదు. అది పర్సనల్ అంటూ చైసామ్ విడాకులపై నాగార్జున స్పందించాడు. ఆ ఇద్దరూ కూడా తనకు ఇష్టమేనని చెప్పుకొచ్చాడు.

reasons behind samantha naga chaitanya divorce

reasons behind samantha naga chaitanya divorce

Samantha చై-సామ్ విడాకులపై సురేఖా వాణి ఎమోషనల్

అలా నాగార్జున ఎంతో ఫీలవుతూ ఓ ట్వీట్ వేశాడు. గుండెల నిండా బాధతో ఈ విషయాన్ని చెబుతున్నాను అంటూ చైసామ్ విడాకులపై ఓ నోట్ వదిలిన నాగ్.. బాగానే ఫీలైనట్టు కనిపిస్తోంది. అయితే నాగార్జున వేసిన పోస్ట్ మీద సురేఖా వాణి స్పందించింది. ఇలా జరగకుండా ఉండాల్సింది.. నిజంగా గుండె ముక్కలైనట్టు అనిపిస్తోంది అంటూ సురేఖా వాణి తన బాధను వ్యక్తం చేసింది. మొత్తానికి సమంత నాగ చైతన్య మాత్రం ఇలా విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి