Supritha : తప్పకుండా చూడాల్సిందే.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఎమోషనల్
Supritha : సురేఖా వాణి కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ తల్లీకూతుళ్లు చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి తిరుగుతుంటారు. పార్టీలు, పబ్బులంటూ కలిసే సందడి చేస్తారు. కలిసి తాగుతుంటారు. అలా మొత్తానికి సురేఖ, సుప్రిత ఇద్దరూ కూడా నెట్టింట్లో నానా హంగామా చేస్తుంటారు. ఇక తమ మీద జరిగే ట్రోలింగ్, వచ్చే రూమర్లు, నెగెటివ్ కామెంట్ల మీద కూడా స్పందిస్తుంటారు. అయితే తాజాగా సుప్రిత ఓ సినిమాను చూసి ఎమోషనల్ అయింది. మామూలుగా వీకెండ్ వస్తే సురేఖ, సుప్రిత ఇద్దరూ పార్టీలు పబ్బులు అని తిరుగుతుంటారు.
లేదంటే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తుంటారు. అలా ఈ వారంలో కూడా వీరు సినిమాకు వెళ్లారు. సుప్రిత సినిమా చూశాక ఎమోషనల్ అయింది. సాయి పల్లవి గార్గి మూవీ ఇప్పుడు సౌత్‌లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. గార్గి సినిమా, అందులో సాయి పల్లవి నటన అందరినీ మెలి పెడుతుంది. అందరి గుండెను బరువెక్కేలా చేస్తుంది. గార్గి సినిమా చూశాక ప్రతీ ఒక్కరూ సాయి పల్లవి నటనను మెచ్చుకుంటారు. పైగా గార్గి సినిమా ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటుంది. అమ్మాయిలపై వేధింపులు, చిన్నపిల్లలపై అత్యాచారాలు వంటి వాటి మీద ఫోకస్ చేస్తూ ఈ సినిమాను తీశారు.
Surekhavani Daughter Supritha Gets Emotional on Sai Pallavi Gargi Movie
ఇక ఇందులో సాయి పల్లవి నటనను చూసి సుప్రిత ఫిదా అయినట్టుంది. ఇక ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.. నేను టాలీవుడ్‌లో ఈ మధ్య చూసిన సినిమాలన్నంటిలో ఇదే బెస్ట్ సినిమా అంటూ సుప్రిత చెప్పుకొచ్చింది. మొత్తానికి సుప్రిత మాత్రం ఈ సినిమాతో కదిలిపోయిందని అర్థమవుతోంది.ఈ సినిమా నా మనసును తాకింది.. అంటూ సుప్రిత తెలిపింది. మొత్తానికి సుప్రిత మాత్రం ఇలా గార్గి సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పేసింది. మొత్తానికి సుప్రిత మాత్రం మరో ప్రైవేట్ ఆల్బమ్‌తో తన ఫ్యాన్స్‌ను పలకరించేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది.
Surekhavani Daughter Supritha Gets Emotional on Sai Pallavi Gargi Movie
