Surekhavani Daughter Supritha Reason About Being Single
Surekhavani Daughter : సురేఖా వాణి కూతురిగా సుప్రితకు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే.అయితే సుప్రిత మాత్రం తన కంటూ ఓ ఫాలోయింగ్‌ను సెట్ చేసుకుంది. నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటూ.. పొట్టి బట్టల్లో కనిపిస్తూ.. పార్టీలు, పబ్బులు అంటూ సందడి చేస్తూ.. ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూ తన ఫాలోవర్లను పెంచుకుంటూ పోయింది. ఇక ట్రోలింగ్, వాటి మీద సుప్రిత సెటైర్లు ఇలా అన్నీ కూడా ఆమెను విపరీతంగా పాపులర్ చేసేశాయి. సుప్రిత హాఫ్ నాలెడ్జ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ వంటి వాటిని నెటిజన్లు బాగా టార్గెట్ చేస్తూ వచ్చేవారు. వాటిపై సుప్రిత కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతుండేది. ఇక తమ మీద వచ్చే రూమర్లను మాత్రం సుప్రిత తీవ్రస్థాయిలో తిప్పి కొట్టేది.
ఇక తన తల్లి రెండో పెళ్లి గురించి పిచ్చి వార్తలు రాసే వారిపైనా సుప్రిత మండిపడుతుంటుంది. ఏదైనా పనికొచ్చే వార్తలు రాయండి.. ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు రాస్తుంటారు అని సుప్రిత ప్రశ్నిస్తుంటుంది. అయితే సుప్రిత అప్పుడప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది. లైవ్‌లోకి వచ్చి సర్ ప్రైజ్ చేస్తుంటుంది. అలా తాజాగా సుప్రిత తన ఫాలోవర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అందులో ఓ నెటిజన్ మాత్రం వింత ప్రశ్నను సంధించాడు. నువ్ ఇంకా ఎందుకు సింగిల్‌గానే ఉన్నావ్ అని అడిగేశాడు. దానికి సుప్రిత రెండు సమాధానాలు చెప్పింది. సింగిల్‌గా ఉండటమే క్రేజీగా ఉంటుంది..
Surekhavani Daughter Supritha Reason About Being Single
అందుకే ఇలా ఉండిపోయాను అని చెప్పింది. ఆ తరువాత మరో పోస్ట్ వేసి.. బీస్ట్ సినిమాలోని పూజా హెగ్డే డైలాగ్ షేర్ చేసింది. తిన్నావా? బుజ్జి, బంగారం.. చిట్టి పొట్టి కుట్టి అనే మెసెజ్‌లు చేయడం నాకు చిరాగ్గా అనిపిస్తుంటుంది అని చెప్పేసింది. అంటే తనకు అలాంటివి ఇష్టం లేవని చెప్పేసింది. ఆ మధ్య సుప్రిత ప్రేమ, పెళ్లి విషయం బాగా ట్రెండ్ అయింది. వెళ్లిపో అనే ప్రైవేట్ ఆల్బమ్ కోసం సుప్రిత చేసిన ప్రమోషన్ స్టంట్ చిలికి చిలికి గాలి వానలా మారిపోయింది. చివరకు సుప్రిత దిగి వచ్చి.. ప్లీజ్ అలా రాయకండి.. తాను ప్రేమలో లేను.. అది కేవలం ప్రమోషన్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.