Akhil : అఖిల్ కి భారీ హిట్ ఇవ్వడం కోసం సురేందర్ రెడ్డి అన్ని విధాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. సైరా తర్వాత సురేందర్ రెడ్డి కి దాదాపు సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో చాలా కామెంట్స్ కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. కాని అవేవి పట్టించుకోని సురేందర్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని లైనప్ చేసుకునే పనిలో పడ్డాడు. ఒక్కసారిగా రెండు భారీ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసి షాకిచ్చాడు. అందులో ఒక ప్రాజెక్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయబోతున్నాడు. రాం తాళ్ళూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు.
ఇక మరో ప్రాజెక్ట్ అఖిల్ అక్కినేని తో చేస్తున్నాడు. ఈ సినిమా అఖిల్ కెరీర్ లో 5 వ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాకి సురేందర్ రెడ్డి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తో కలిసి సురేందర్ రెడ్డి నిర్మిస్తూ దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే అఖిల్ 5 ని సురేందర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. అందుకే బడ్జెట్ విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. కథ కూడా కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. రేసుగుర్రం..ధృవ లాంటి భారీ సక్సస్ అందుకునేలా సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక హీరోయిన్ విషయంలో కూడా సురేందర్ రెడ్డి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుల్ మోహన్.. ఉప్పెన ఫేం కృతి శెట్టి పేర్లు అఖిల్ 5 కి పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే బాలీవుడ్ మోడల్ వైద్యసాక్షి ని కూడా చూస్తున్నట్టు వార్తలు రాగా దాదాపు ఈ బ్యూటీనే హీరోయిన్ గా ఫైనల్ చేశారని అంటున్నారు. అంతేకాదు వైద్యసాక్షి నేచురల్ పర్ఫార్మెన్స్ లో సాయి పల్లవి రేంజ్ అని సురేందర్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నాడట. ఇప్పటికే సురేందర్ రెడ్డి వైద్యసాక్షి ని అన్ని రకాలుగా పరిశీలించి అఖిల్ కి జంటగా పర్‌ఫెక్ట్ అని భావించాడని తెలుస్తోంది. వైద్యసాక్షి నే హీరోయిన్ గా ఫిక్స్ చేశారని సమాచారం. ఇక ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.