Pooja Hegde : బాడీలో దానికి సర్జరీ చేయించుకోనున్న పూజా హెగ్డే..
Pooja Hegde : పూజా హగ్డే ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఈ అమ్మడు నటించిన సినిమాలు భారీ వసూళ్లు రాబడుతుండటంతో అవకాశాలు కూడా భారీగానే వస్తున్నాయట..దీంతో ఈ బ్యూటీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అగ్రహీరోలను వరుసగా లైన్లో పెడుతున్న పూజా.. ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూజా తన గ్లామర్ మరింత పెంచుకోవడానికి తన బాడీ పార్ట్‌కు సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నదట..
Pooja Hegde : సర్జరీతో గ్లామర్ పెరుగుతుందా..
పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో అన్ని ప్లాపులే ఉన్నాయి. దీంతో ఆమె తీవ్రంగా నిరాశ చెందినదని టాక్. అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకుంది. అయితే, తెలుగులో మాత్రం పూజాకు లైఫ్ ఇచ్చింది మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని జోరుగా ప్రచారం సాగుతోంది. అప్పట్లో వీరిద్దరి మధ్య ఏదో ఉందని కూడా పుకార్లు వచ్చాయి. అందుకే మాటల మాంత్రికుడు తన సినిమాల్లో పూజాకు ఎక్కువగా అవకాశం ఇస్తున్నాడని ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా.. అరవిందసమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
వసూళ్ల పరంగాను రెండు పెద్ద హిట్ సినిమాలు. దీంతో పూజాకు త్రివిక్రమ్ మధ్య ఏదో ఉందని ఊహాగానాలు వచ్చాయి.అంతేకాకుండా పూజాను హీరోయిన్‌గా తీసుకోవాలని త్రివిక్రమ్ ఇతర దర్శకులకు చెప్పేవారని కూడా ప్రచారం జరిగింది. కాగా, పూజా ఎప్పుడైతే అందాలు ఆరబోయడం ప్రారంభించిందో నాటి నుంచి ఆమెకు అవకాశాలు తలుపు తట్టాయని టాక్. దువ్వాడ జగన్నాథం సినిమాలో పూజా బికినీతో రెచ్చిపోయింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో పాటు పూజాకు కూడా అవకాశాలను తెచ్చిపెట్టింది. తాజాగా పూజా తన అందం మరింత పెంచుకోవడానికి తన ముక్కుకు సర్జరీ చేయించుకోవాలని అనుకున్నదట. ఇదే విషయం బాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉందట..