SV Krishna Reddy’s : నేటి యువ దర్శకులపై సీనియర్ డైరెక్టర్ SV కృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
ప్రధానాంశాలు:
SV Krishna Reddy's : నేటి యువ దర్శకులపై సీనియర్ డైరెక్టర్ SV కృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు...
SV Krishna Reddy’s : తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు గొప్ప గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ, దర్శకులలో మాత్రం అంత స్థాయిలో పేరు పొందినవారు కొద్ది మందే. వారిలో ప్రముఖుడు ఎస్.వి.కృష్ణారెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. 1990లలో ఎస్.వి.కృష్ణారెడ్డి సినిమా వస్తుందని తెలియగానే అది హిట్ అవుతుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉండేది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ కలిగి ఉండే ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పటికి బుల్లితెరపై ఆయా చిత్రాలను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
SV కృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇక హీరోయిన్ల ఎంపికలో కూడా ఆయనకే ప్రత్యేకమైన కోణం ఉంది. తన సినిమాల్లో నటించాల్సిన నటీమణుల ఎంపికలో ఎస్.వి.కృష్ణారెడ్డి శరీర ఆకృతి లేదా గ్లామర్‌కి ప్రాధాన్యత ఇవ్వకుండా ముఖంలో ఉన్న ఎమోషన్ ఆధారంగా సెలెక్ట్ చేసేవారు. కాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. “నటన అనేది కళ్ళ ద్వారా, ముఖ హావభావాల ద్వారా ముందుగా కనిపిస్తుంది. కళ్ళలో ఎమోషన్ చూపిస్తే, నుదురులో ఇంకో భావం కనిపించాలి” అని పేర్కొన్నారు. ఇలాంటి నటీమణులు తన సినిమాల్లో నటిస్తే ప్రేక్షకులకు భావోద్వేగం బాగా కనెక్ట్ అవుతుందని ఆయన నమ్మకం.
ఇప్పుడు సినిమా పరిశ్రమలో చాలా మంది దర్శకులు గ్లామర్‌ను ప్రధానంగా చూపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలనే దిశగా ప్రయోగాలు చేస్తున్నారు. కాని ఎస్.వి.కృష్ణారెడ్డి వంటి దర్శకులు మాత్రం కధలో ఉన్న తత్వాన్ని, భావాన్ని కాపాడుతూ, కథకి న్యాయం చేసే నటీనటులను ఎంపిక చేయడంలో దృష్టి పెట్టేవారు. ఇదే కరెక్ట్ అంటూ చాలామంది సినిమా మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా దర్శకులు అందించిన విలువలే తెలుగు సినిమా స్థాయిని ఈ స్థాయికి తీసుకెళ్లాలని గొప్పగా చెపుతున్నారు.