Radhe Shyam : రాధే శ్యామ్ సినిమాని నోటితో దించేసిన దివ్యాంగురాలు.. ఫిదా అయిన ద‌ర్శ‌కుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Radhe Shyam : రాధే శ్యామ్ సినిమాని నోటితో దించేసిన దివ్యాంగురాలు.. ఫిదా అయిన ద‌ర్శ‌కుడు

Radhe Shyam : సాహో త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, క‌రోనా వల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు మార్చి 11న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ మాత్రం భారీగానే రాబ‌డుతుంది. రాధే శ్యామ్ సినిమాలో మన హీరో ప్రభాస్ హస్తసాముద్రికంలో నిపుణుడు. అయితే అసలు చేతులే లేని వాళ్ల భవిష్యత్తుని ఎలా చెప్పడం సాధ్యమవుతుంది?.. అంటే […]

 Authored By sandeep | The Telugu News | Updated on :14 March 2022,9:00 pm

Radhe Shyam : సాహో త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, క‌రోనా వల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు మార్చి 11న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ మాత్రం భారీగానే రాబ‌డుతుంది. రాధే శ్యామ్ సినిమాలో మన హీరో ప్రభాస్ హస్తసాముద్రికంలో నిపుణుడు. అయితే అసలు చేతులే లేని వాళ్ల భవిష్యత్తుని ఎలా చెప్పడం సాధ్యమవుతుంది?.. అంటే చేతిలోని రాతలు కాదు.. మన చేతలే భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అనే అంతర్లీనమైన సందేశాన్ని ఇచ్చాడు. ఈ సీన్, ఈ డైలాగ్ ఓ దివ్యాంగురాలిని తెగ ఆకట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళంలోని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక. ఈమె గతంలో కూడా అనేక బొమ్మలని నోటితో పెయింట్ వేసింది. పవన్ కళ్యాణ్ ఫోటోని కూడా వేసి పాపులర్ అయింది. తాజాగా ‘రాధేశ్యామ్‌’ని చూసి ఆ సినిమా తనకు ఎలా స్ఫూర్తినిచ్చిందో అంటూ ఓ పెయింట్ ని వేసి ట్వీట్ చేసింది. ఆ పెయింట్, ట్వీట్ ని డైరెక్టర్ రాధేశ్యామ్ చూసి అభినందించారు. పలు ప్రెస్ మీట్స్ లో కూడా దీనిపై మాట్లాడారు.డైరెక్టర్ రాధాకృష్ణ ఆ అమ్మాయిని కలుసుకున్నాడు. ఆమెతో పాటు ఆమె గీసిన పెయింట్ తో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Swapnika Radhe Shyam movie in painted on mouth

Swapnika Radhe Shyam movie in painted on mouth

Radhe Shyam : స్వ‌ప్నిక డ్రాయింగ్‌తో ఆక‌ట్టుకుంది..

ఆమెతో దిగిన ఫోటోని షేర్ చేసి.. ”రాధేశ్యామ్ మీకు స్ఫూర్తినిచ్చింది. మీరు ఈ రోజు నాతో పాటు, దేశాన్ని కూడా ప్రేరేపించారు. నాలాంటి దర్శకులు ఏదో ఒకరోజు నీ మీద సినిమా చేస్తారని నమ్ముతున్నాను. దేవుడు నిన్ను చల్లగా చూడాలి” అంటూ రాధాకృష్ణ ట్వీట్ చేశారు. రాధే శ్యామ్ సినిమాలోని సీన్‌ను ప్రతిబింబించేలా ఆ చిత్రం ఉండటంతో షాక్ అయ్యాడు.ఇక రాధాకృష్ణ స్వప్నికని కలిసి అభినందించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దర్శకుని మంచితనాన్ని ప్రశంశిస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది