Acharya – Pooja Hegde : ఇక పూజా హెగ్డేను మన మేకర్స్ పక్కన పెడతారా..ఆచార్యకు మళ్ళీ దెబ్బ పడిందిగా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Acharya – Pooja Hegde : ఇక పూజా హెగ్డేను మన మేకర్స్ పక్కన పెడతారా..ఆచార్యకు మళ్ళీ దెబ్బ పడిందిగా..?

 Authored By govind | The Telugu News | Updated on :29 April 2022,9:30 pm

Acharya – Pooja Hegde: ఇక పూజా హెగ్డేను మన మేకర్స్ పక్కన పెడతారా..ఆచార్యకు మళ్ళీ దెబ్బ పడిందిగా..? అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా లో కామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య సినిమా ఫలితమే. ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా కూడా వరుసగా రెండు ఫ్లాపులొస్తే మాత్రం ఆమె వంక దర్శక, నిర్మాతలు చూసేందుకు ఆసక్తి చూపించరు. ఈ విషయం ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారి విషయంలో చాలాసార్లు నిరూపణ అయింది. ఇప్పుడు అదే మళ్ళీ పూజా విషయంలో జరగనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

పూజా హెగ్డే కెరీర్‌లో ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయనే విషయం ఆమె అభిమానులైనా ఒప్పుకోవాల్సిందే. కెరీర్ ప్రారంభంలో పూజాకు ఎక్కువగా ఫ్లాపులే వచ్చాయి. అయినా మన మేకర్స్ అవకాశాలివ్వడంతో నిలదొక్కుకొని ఇప్పుడు స్టార్ హీరోయిన్‌ గా మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా చలామణి అవుతోంది. ఇటు టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటుగా అటు బాలీవుడ్‌లోనూ పూజా హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. అయితే, వాస్తవంగా ఆమె ఖాతాలో ఉన్న భారీ హిట్స్ అంటే రెండు సినిమాలే. అవి మహర్షి, అల వైకుంఠరములో మాత్రమే. అరవింద సమేత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హిట్ టాక్ తెచ్చుకున్న భారీ హిట్ మాత్రం కాదనే చెప్పాలి.

will pooja hegde ignored by makers

will pooja hegde ignored by makers

Acharya – Pooja Hegde : పూజా ఆచార్యకు ఉన్న మైనస్‌లలో మేయిన్ మైనస్..?

ఇక పాన్ ఇండియన్ హీరోయిన్‌గా సత్తా చాటాలనుకున్న పూజాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అదే మేకర్స్‌ను ఇప్పుడు భయపెడుతుంది. ప్రభాస్‌తో చేసిన రాధే శ్యామ్ సినిమా భారీ డిజాస్టర్..ఆ తర్వాత బీస్ట్ అదే టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆచార్య సినిమాతో పూజా హెగ్డే ఖాతాలో హ్యాట్రిక్ డిజాస్టర్స్ పడ్డాయి. ఆచార్య సినిమాలో ముందు పూజా హెగ్డే రోల్ లేదు. చరణ్ పాత్ర నిడివి ఎప్పుడైతే పెరిగిందో..అప్పుడు ఆయన సరసన హీరోయిన్ కావాల్సి వచ్చింది. దాంతో చరణ్ ఏరి కోరి పూజాను దింపాడు. ఇప్పుడు పూజా ఆచార్యకు ఉన్న మైనస్‌లలో మేయిన్ మైనస్ అని చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు పూజా గురించి నిర్మాతల మైండ్ సెట్‌లో మార్పులేమైనా వస్తాయా చూడాలి.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది