Virat Kohli : అప్పట్లో విరాట్ కోహ్లీతో తమన్నా ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 21, 2021, 9:40 pm

Virat Kohli : టాలీవుడ్ లో దశాబ్ద కాలం కిందట ఎంట్రీ ఇచ్చి.. నేటికీ వరుస సినిమాలతో దూసుకు పోతున్న నటి తమన్నా. అందం, అభినయం కలగలసిన హీరోయిన్లలో ముందు వరసలో ఉంటుంది ఈ మిల్కీ బ్యూటీ. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోవడం లో ఆమె రూటే వేరు. హీరోయిన్ గానే కాకుండా ఐటెం గర్ల్ గా, ఇటీవల ప్రతినాయక పాత్ర లోనే సత్తా చాటుతున్న తమన్నా బర్త్ డే నేడు. మిల్కీ బ్యూటీ కెరీర్ లో సినిమాలు ఆమెకు ఎంత పేరైతే తెచ్చాయో.. ఆమె నటించిన కొన్ని యాడ్ లు ఆమెపై పుకార్లు తీసుకొచ్చాయి. తమన్నాకి ఆ పలువురితో లింక్స్ పెడుతూ వార్తలు అప్పట్లో తెగ చక్కర్లు కొట్టాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.టాలెంటెడ్ యాక్ట్రస్ తమన్నా 2012లో క్రికెటర్ విరాట్ కోహ్లీ తో కలిసి ఓ అడ్వైజ్‌మెంట్‌లో నటించింది.

అయితే దీని తర్వాత వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వారి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే వార్తలు కొన్నేళ్ల పాటు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అనంతరం కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క తో బంధం మొదలు పెట్టిన తర్వాత ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే వీరి మధ్య ఇంకా స్నేహ బంధం మాత్రం కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. ఈ జోడి ఇటీవల ఎం.పీ.ఎల్ యాడ్ లో కలిసి నటించడమే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు.ఇండియన్ క్రికెటర్ కోహ్లీతో లవ్ రూమర్స్ ఇలా ఉండగా మరోవైపు పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తోనూ మిల్కీ బ్యూటీ ప్రేమాయణం నడిపిందనే పుకార్లు అప్పట్లో చక్కర్లు కొట్టాయి.

tamanna gives clarity on love roumours with cricketer Virat Kohli

tamanna gives clarity on love roumours with cricketer Virat Kohli

Virat Kohli :  క్రికెటర్లతో తమన్నా ప్రేమాయణం..!

వారిద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటో అప్పట్లో తెగ వైర‌ల్ అయింది. కాబోయే భార్య‌ తమన్నాకు.. రజాక్ ద‌గ్గ‌రుండి మ‌రీ న‌గ‌లు కొనిస్తున్నాడంటూ అప్పట్లో ట్రోల్స్ నడిచాయి. అయితే ఈ రూమర్స్ పై తమన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తను ఎవ‌రితోనూ రిలేషన్ లో లేనని స్పష్టం చేసింది. ఆ ఫోటో వారిద్దరూ కలిసి ఓ షాపింగ్ మాల్ కు వెళ్ళినపుడు దిగిన ఫోటో అని ఆమె క్లారిటీ ఇచ్చింది.మిల్కీ బ్యూటీ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌తో కలిసి ‘ఎఫ్ 3’ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు గుర్తుందా శీతాకాలం అనే కన్నడ మూవీలో సత్యదేవ్ తో కలిసి నటిస్తోంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది 2022లో విడుదల అవ్వనున్నాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp