Tamannaah : కాలం కలిసిరాకపోతే అంతే.. తమన్నా ఏం చేయగలదు..?

Authored By vamana sai | The Telugu News | Published on: June 6, 2022, 11:00 am

Tamannaah : ఒకప్పుడు మిల్కీ బ్యూటీగా తమన్నాకు ఉన్న క్రేజ్ అండ్ పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. రాజామౌళి రూపొందించిన బాహుబలి సిరీస్ చిత్రాలలోనూ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలలోనూ నటించి ఎలాంటి పాత్రలనైనా చేయగలదని నిరూపించుకుంది. తమన్నా అంటే అన్నీ ఏజ్ గ్రూప్ హీరోలకు బెస్ట్ అండ్ బెటర్ ఛాయిస్..అని మేకర్స్ చెప్పుకున్నారు. ఇప్పటికీ ఆ పేరు కొనసాగుతుంది. నాని, నితిన్, నాగ చైతన్య, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రాం చరణ్..ఇలా యంగ్ హీరోలతో నటించిన తమన్నా..మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలతోనూ ఆడిపాడింది.

అయితే, ఈ మధ్య కాలంలో తమన్నాకు సాలీడ్ హిట్ దక్కలేదు. ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్ళు దాటినా కూడా చెక్కు చెదరని పాల మీగడ లాంటి అందంతో ఆకట్టుకుంటోంది. పర్ఫార్మెన్స్ పరంగా తమన్నాకు వంక పెట్టడానికి ఏమాత్రం వీలు లేస్దు. పోనీ అమ్మడి ఖాతాలో హిట్స్ లేవా అంటే కెరీర్ ప్రారంభం నుంచి చూసుకుంటే 80 శాతం హిట్ సినిమాలే ఉన్నాయి. హీరోలకు తనతో నటిస్తే హిట్ దక్కుతుందనే ఫీలింగ్ ఉంది. అందుకే, తమన్నాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.అయితే, ఇటీవల ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి.

Tamannaah has not had a solid hit in recent times

Tamannaah has not had a solid hit in recent times

Tamannaah : తన ఖాతాలో ఎఫ్ 3 ఉందంటే ఉంది అంతే.

దాంతో ఎఫ్ 2 సీక్వెల్‌గా వచ్చిన ఎఫ్ 3 మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది తమన్నా. ఈ సినిమా ఇటీవల వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. కానీ, ఎక్కడా కూడా బ్లాక్ బస్టర్ అనే టాక్ అంతగా వినిపించలేదు. ఇదిలా ఉంటే తమన్నాకు ఎఫ్ 3 వల్ల కలిసొచ్చిందేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. సినిమా నిండా ఆర్టిస్టులు ఉండటంతో తను తేలిపోయిందంటున్నారు. అందుకే, తన ఖాతాలో ఎఫ్ 3 ఉందంటే ఉంది అంతే. ఇప్పుడు ఈ మిల్కీ బ్యూటీ ఆశలన్నీ మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న భోళా శంకర్ సినిమా మీదే ఉన్నాయి. ఇప్పుడు తన చేతిలో ఉన్న సినిమా అదొక్కటే. చూడాలి మరి తమన్నాకు చిరు హిట్ ఇస్తారో లేదో.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp