Tamannaah వెంకీమామను పీక్కు తినేందుకు రెడీ.. అడుగుపెట్టేసిన తమన్నా

Authored By Cinema Desk | The Telugu News | Updated on: February 1, 2021, 10:00 pm

Tamannaah : అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ చేసిన మ్యాజిక్ ఎఫ్ 2. తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ ఇలా అందరూ కలిసి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ తీసిన ఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. అలా బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ తీస్తోన్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే ఈ సంక్రాంతికి ఎఫ్ 3 కూడా థియేటర్లోకి వచ్చేది. కానీ లాక్డౌన్, కరోనా వల్ల అంతా మారిపోయింది.

అలా చివరకు ఎఫ్ 3 సినిమా ఈ మధ్యే మొదలైంది. చకచకా షూటింగ్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇన్ని రోజులు వెంకటేష్, వరుణ్ తేజ్‌ల మీద సీన్స్ తెరకెక్కించారు. కానీ ఇప్పుడు అలా అల్లుళ్లని పీక్కుతినేందుకు అత్తలు, భర్తను ముప్పుతిప్పలు పట్టేందుకు తమన్నా కూడా రంగంలోకి దిగింది. నేటి నుంచి తమన్నా, వై విజయ, అన్నపూర్ణమ్మ ఇలా అందరూ కూడా షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టేశారు. ఈ మేరకు డైరెక్టర్ ట్వీట్ కూడా చేశారు.

Tamannaah joins f3 Set

Tamannaah joins f3 Set

Tamannaah మీ హారిక వచ్చేసింది.. : తమన్నా

ఇకపై ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే సీన్లను తెరకెక్కించబోతోన్నామని ప్రకటించారు. ఈ మేరకు హారిక క్యారెక్టర్‌లో తమన్నా మళ్లీ జీవించేందుకు వచ్చేసింది. ఇదే విషయాన్ని తమన్నా చెబుతూ..తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చింది. మీ హారిక వచ్చేసింది.. కానీ ఈ సారి అంతకు మించి అనేలా ఉండబోతోంది.. మళ్లీ తిరిగి ఎఫ్ 3 సెట్‌లో అడుగుపెట్టినందుకు ఎంతోసంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి దిల్ రాజు ఇటీవలె ఎఫ్ 3 సినిమాను ఆగస్ట్ 27న విడుదల కాబోతోందని ప్రకటించాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp