
Tamannah: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉన్న స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా. మిల్కీ బ్యూటీగా టాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలోనూ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. బాహుబలి, సైరా లాంటి పాన్ ఇండియన్ సినిమాలలో నటించే గొప్ప అవకాశం అందుకున్న ఈ మిల్కీ బ్యూటీ చేతిలో ప్రస్తుతం కూడా అరడజను సినిమాలున్నాయంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికి కప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో ఇటు ప్రేక్షకులను, అటు మేకర్స్‌ను ఒకేసారి ఆకట్టుకుంటోంది.
tamannah-likes that dish very much
అంతేకాదు తన లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో తన అందం తరగడం లేదు..ఇంకా పెరుగుతూనే ఉందని కూడా చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం తమన్నా నటించిన సీటిమార్, మాస్ట్రో, దటీజ్ మహాలక్ష్మీ సినిమాలు రిలీజ్‌కి సిద్దంగా ఉన్నాయి. గుర్తుందా శీతాకాలం సహా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా, వెబ్ సిరీస్ కూడా ఓకే చేసిందని సమాచారం. ఒకవైపు సినిమాలు మరొక వైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న తమన్నా భాటియా బులీతెర మీద కూడా సందడి చేయడానికి సిద్దమయింది. హాలీవుడ్‌లో పాపులర్ కుకరీ షోను సౌత్ లో చేస్తున్నారు.
ఇక్కడ పలు భాషల్లో ఒకేసారి ప్రసారం చేయనున్న ఈ కుకరీ షో తెలుగు వెర్షన్‌కి తమన్నా హోస్ట్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల వచ్చిన ప్రోమోతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తనకి ఆంధ్రా వంటకాలంటే చాలా ఇష్టమని చెప్పింది. అంతేకాదు ఇక్కడ చాలా ప్రత్యేకమైన చేపల పులుసంటే చాలా ఇష్టమట. నెలకొకసారి కాకపోయినా షూటింగ్ నిమిత్తం ఎప్పుడు వెళ్ళినా దాన్ని తప్పకుండా లాగిస్తుందట మన మిల్కీ బ్యూటీ. ఇక హైదరాబాద్ వస్తే మాత్రం ఇక్కడ ధమ్ బిర్యానీని ఓ పట్టు పట్టాల్సిందేనట. ఇక షూటింగ్ లో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడి వంటకాలను అలవాటు చేసుకుంటానని చెప్పింది తమన్నా.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.