Vijay Antony Daughter Died : విషాదం.. విజయ్ అంటోని కూతురు ఆత్మహత్య.. తను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఇదే?

Advertisement

Vijay Antony Daughter Died : విజయ్ అంటోని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తమిళం నటుడు, మ్యూజిక్ డైరెక్టర్. బిచ్చగాడు సినిమా చూసిన వాళ్లకు విజయ్ అంటోని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవలే బిచ్చగాడు 2 సినిమాలో కూడా నటించాడు విజయ్. అయితే.. తాజాగా ఆయన కూతురు లారా ఆత్మహత్య చేసుకుంది. దీంతో తమిళ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. 12వ తరగతి చదువుతున్న విజయ్ అంటోని కూతురు లారా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేదానిపై క్లారిటీ రావడం లేదు.

Advertisement
tamil actor vijay antony daughter laura commits suicide
vishadam

తెల్లవారుజామున 3 గంటలకు తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విజయ్ అంటోనీ తన ఫ్యామిలీతో చెన్నైలో ఉంటున్నాడు. తన రూమ్ లోనే రాత్రి లారా ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు వ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశం అయింది. అసలు విజయ్ అంటోనీ కూతురు ఆత్మహత్యకు కారణం ఏంటి అనేది మాత్రం స్పష్టం కావడం లేదు. లారా వయసు 16 ఏళ్లు. డీడీకే రోడ్ లో విజయ్ నివాసం ఉంటున్నాడు.

Advertisement

Vijay Antony Daughter Died : చెన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న లారా

అయితే.. లారా చెన్నైలోనే ఓ ప్రైవేటు పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా లారా ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి విజయ్ ఆ మధ్య ఆత్మహత్యలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారంటే ముఖ్యంగా పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే దానికి రెండే కారణాలు ఉంటాయని ఒకటి చదువు ఒత్తిడి, రెండోది తల్లిదండ్రుల ఒత్తిడి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన కూతురే ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీలో ఈ ఘటనపై తెగ చర్చిస్తున్నారు. ఇక.. ఈ విషయం తెలిసి పలువురు కోలీవుడ్ ప్రముఖులు విజయ్ ని కలిసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Advertisement
Advertisement