TDP : దాడి జరగబోతుందని ఊహించిన టీడీపీ కార్యాలయ సిబ్బంది పోలీసుల ఆడియో లీక్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP : దాడి జరగబోతుందని ఊహించిన టీడీపీ కార్యాలయ సిబ్బంది పోలీసుల ఆడియో లీక్..!

TDP : ఆంధప్రదేశ్‌లో రాజకీయం ప్రస్తుతం బాగా వేడెక్కింది. టీడీపీ కార్యాలయాలపై, వైసీపీ కార్యకర్తల దాడి నేపథ్యంలో దాడిని ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరిట 36 గంటల నిరసన దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్షకు కౌంటర్‌గా వైసీపీ ‘జనాగ్రహ దీక్ష’లు చేస్తున్నది. మొత్తంగా ఏపీ రాజకీయం అట్టుడుకుతున్నది. కాగా, టీడీపీ ఆఫీసుపై దాడి జరగబోతున్నది ముందే ఆ పార్టీ కార్యాలయ సిబ్బంది గ్రహించి, ఆ విషయం పోలీసులకు చెప్పింది కూడా. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :22 October 2021,11:11 am

TDP : ఆంధప్రదేశ్‌లో రాజకీయం ప్రస్తుతం బాగా వేడెక్కింది. టీడీపీ కార్యాలయాలపై, వైసీపీ కార్యకర్తల దాడి నేపథ్యంలో దాడిని ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరిట 36 గంటల నిరసన దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్షకు కౌంటర్‌గా వైసీపీ ‘జనాగ్రహ దీక్ష’లు చేస్తున్నది. మొత్తంగా ఏపీ రాజకీయం అట్టుడుకుతున్నది. కాగా, టీడీపీ ఆఫీసుపై దాడి జరగబోతున్నది ముందే ఆ పార్టీ కార్యాలయ సిబ్బంది గ్రహించి, ఆ విషయం పోలీసులకు చెప్పింది కూడా. అయితే, టీడీపీ సిబ్బంది ఫిర్యాదుకు పోలీసులు ఏ విధంగా స్పందించారంటే..

tdp office receptionist informed to police about attack

tdp office receptionist informed to police about attack

ఆత్మకూరులో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగబోతున్నదని ఆ పార్టీ సిబ్బంది ముందే గ్రహించారు. ఈ క్రమంలోనే తమ పార్టీ ఎదుట ఉన్న ప్రాంతంలో కొంత మంది బైకులపై ఉన్నట్లు గుర్తించారు. పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు కూడా. ఇందుకు సంబంధించిన ఆడియో ప్రజెంట్ నెట్టింట వైరలవుతోంది. సదరు ఫోన్ కాల్ సంభాషణలో టీడీపీ రిసెప్షన్ ఆఫీసులో పని చేసే కుమారస్వామి అనే వ్యక్తి తమ కార్యాలయం బయట చాలా మంది ఉన్నారని చెప్పాడు. పోలీస్ స్టేషన్‌లో ఉన్నటువంటి రవి అనే కానిస్టేబుల్ కుమారస్వామికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకన్నాడు. కానీ, బయట హైవే రోడ్‌కు ఆనుకుని ఉండటం వల్ల ఎక్కువ మంది ఉండొచ్చని, బయట ఎంత మంది ఉన్నారనేది తమకు మళ్లీ ఇన్ఫామ్ చేయాలని చెప్పాడు.

TDP : మళ్లీ ఫోన్ చేయాలన్ని కానిస్టేబుల్..

tdp

tdp

ఈ లోపు తాను ఎస్‌ఐకి విషయం చెప్తానని అన్నాడు. అయితే, పక్కనే డీజీపీ కార్యాలయం ఉందని, తమ కార్యాలయంపై దాడి జరిగే సంకేతాలు కనబడుతున్నాయని టీడీపీ కార్యాలయ సిబ్బంది చెప్పకనే చెప్పాడు. అయితే, ఈ ఆడియో కాల్ సంభాషణను బట్టి పోలీసులు ఇంకా తగు విధంగా స్పందించాలేకపోయారే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కనుక ఫిర్యాదు అందిన వెంటనే టీడీపీ ఆఫీసు వద్దకు వెళ్లి ఉంటే వైసీపీ కార్యకర్తల దాడి జరగకుండా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది