
లవ్ స్టోరీ .. అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ సినిమా. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం లవ్ స్టోరీ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సినిమా మీద అంచనాలు భారీగా పెరిగేలా చేశాయి. పక్కా శేఖర్ కమ్ముల మార్క్ తో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా మీద అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. మజిలీ లాంటి సూపర్ హిట్ తర్వాత నాగ చైతన్య నుంచి వస్తున్న ఈ సినిమా తో మరో హిట్ దక్కబోతుందన్న నమ్మకంగా ఉన్నాడు.
కాగా ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. నాగ చైతన్య – సాయి పల్లవి సినిమాలోని పాత్రలకు ప్రాణం పోశారని తాజా టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఎమోషనల్ లవ్ స్టోరీగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ ఆయన గత చిత్రాలకంటే భారీ హిట్ అందుకోవడం పక్కా అని ఈ టీజర్ చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ టీజర్ చివరిలో నాగ చైతన్య ని చూస్తు ఏంరా నన్ను వదిలేస్తావా అన్న డైలాగ్ యూత్ కి సూపర్ కిక్ ఇస్తోంది.
కాగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతం అందించాడు. కాగా నాగ చైతన్య ప్రస్తుతం విక్రం కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక సాయి పల్లవి విరాట పర్వం, నాని తో శ్యాం సింగ్ రాయ్ సినిమాలు చేస్తోంది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.