Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆరో వారంలోకి అడుగపెట్టేందుకు సిద్ధమైంది. ఈ షోలో ఆసక్తిని కలిగించే ఎలిమినేషన్స్ , ఎన్నో రకాల పరిణామాలతో షో ఆద్యంతం మజాను పంచుతూనే ఉంది. బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్ కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఊహించని ఎలిమినేషన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఐదో వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలిసింది. ఇందులో ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్లిపోయిందట.ఆమె మరెవరో కాదు తేజస్విని. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ అంతకంతకూ ఆసక్తికరంగా సాగుతోంది.
గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కంటెంట్‌ను ఇందులో ప్రసారం చేస్తుండడంతో పాటు బోల్డుగా చూపిస్తుండడంతో దీనికి ఆదరణ భారీగా పెరుగుతోంది.నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 4 వారాల్లో ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయులు బయటకు వెళ్లారు. ముమైత్ ఖాన్ తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఐదో వారం ఎవరు హౌజ్ ని వీడనున్నారనే ఆసక్తికర చర్చ సాగుతుంది. ఐదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ టాస్క్ లో స్వైప్ చేసే టాస్కును కూడా ఇచ్చారు.
దీంతో అషు, మహేశ్ విట్టా దీని నుంచి సేఫ్ అయ్యారు.ఇలా చివరికి ఇందులో మొత్తం బిందు మాధవి, మిశ్రా శర్మ, యాంకర్ శివ, ఆరియానా గ్లోరీ, స్రవంతి చోకారపు, తేజస్వీ మదివాడ, అనిల్ రాథోడ్‌లు నామినేట్ అయిపోయారు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బిందు మాధవికి ఐదో వారం ఓటింగ్‌లో ఎక్కువ పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మరోసారి టాప్ ప్లేస్‌లో నిలిచిందట. ఆమె తర్వాత యాంకర్ శివ, ఆరియానా గ్లోరీ, అనిల్ రాథోడ్‌లకు ఎక్కువ ఓటింగ్ జరిగిందని అంటున్నారు. దీంతో వీళ్లంతా ఈ వారానికి కూడా సేఫ్ అయిపోయారని సమాచారం. తేజస్వీ మదివాడ, మిత్రా శర్మ, స్రవంతి చోకారపులకు చాలా తక్కువ ఓటింగ్ రాగా, తేజస్వి ఎలిమినేట్ అయిందని అంటున్నారు. మరి కొద్ది గంటలలో దీనిపై క్లారిటీ రానుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.