Health Benefits : ప్రస్తుతం కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్లకు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎవర్ని చూసినా లావుగా కనిపిస్తున్నారు. చాలా మంది అధిక బరువు కారణంగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే శరీరంలో బరువు పెరిగే కొద్దీ పొట్ట, తొడలు, సీటు భాగంతో పాటు ముఖంలో గడ్డం కింద భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోతుంది. అయితే గడ్డం కింద కొవ్వు పేరుకుపోవడాన్నే డబుల్ చిన్ అంటారు. డబుల్ చిన్ కారణంగా… మనం గాలి తీసుకునే గొట్టం మీద ప్రెషర్ ఎక్కువవుతుంది. అందువల్లే మనం నిద్రపోతున్నప్పుడు గురక చప్పుడు వస్తుంది.
అంతే కాదండోయ్ డబుల్ చిన్ ఉన్నవారు నోరు తెరిచి నిద్ర పోతుంటారు. ఎక్కువగా ఆయాస పడుతుంటారు. గడ్డం కింద కొవ్వు ఎక్కువగా ఉన్న వారి నాలుక భాగంలో కూడా చాలా వరకు కొవ్వు ఉంటుంది. దీని వల్ల మనం నిద్రపోతున్నప్పుడు ఉలిక్కిపడి లేవడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. డబుల్ చిన్ ఉన్న వాళ్లు మద్యంపానం సేవించడం వల్ల ప్రాణ హాని కూడా కల్గే అవకాశం ఉంటుంది. అయితే ఒక మనిషికి ఇన్ని ఇబ్బందులు కల్గించే డబుల్ చిన్ ని తగ్గించుకోవాలంటే సరైన డైట్ తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.డబుల్ చిన్ ఉన్న వాళ్లు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కచ్చితంగా ఫ్రూట్ సలాడ్ అండ్ వెజిటేబుల్ సలాడ్ తీసుకోవాల్సిందేనని వివరిస్తున్నారు
ఉదయం లేవగానే కొన్ని రకాల పండ్ల ముక్కలతో పాటు కొన్ని స్ప్రౌట్స్ తీసుకొని… ఇందులో మిరియాల పొడి, జీలకర్ర, ధనియాల పొడి లేదా కొంచెం చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని తినాలి. సాయంత్రం కొన్ని కూరగాయ ముక్కలతో సలాడ్ చేసుకొని తినాలి. మద్యాహ్నం ఒక పుల్కాను ఎక్కువ కూరతో తినాలి. ఇలా తినడం వల్ల గడ్డం కింద కొవ్వు తగ్గుతుంది. దీంతో పాటు నెక్ ఎక్సర్ సైజ్ చేయాలి. ప్రాణాయామం వంటివి ప్రతిరోజూ చేస్తుండాలి. మెడను అటు ఇటు తిప్పే ఎక్సర్ సైజ్… క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, కిందకు, మీదకు తిప్పడం వల్ల డబుల్ చిన్ పూర్తిగా తగ్గిపోతుంది. వారం రోజుల పాటు పైన చెప్పినట్లు చేయడం వల్ల గడ్డం కింద ఉండే కొవ్వును పూర్తిగా కరిగించుకోవచ్చు. మీరు ఓ వారం రోజులు ట్రై చేసి చూడండి.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.