
Hari Hara Veera Mallu : తెలంగాణలో హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్‌కి గ్రీన్ సిగ్నల్.. టిక్కెట్ల రేట్లు పెరుగుదల
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 23న ప్రత్యేక బెనిఫిట్ షోలకు కూడా గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ విన్నపాన్ని పరిశీలించిన ప్రభుత్వం, టికెట్ ధరలు పెంపునకు ఓకే చెప్పింది.
Hari Hara Veera Mallu : తెలంగాణలో హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్‌కి గ్రీన్ సిగ్నల్.. టిక్కెట్ల రేట్లు పెరుగుదల
ప్రిమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ధారిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా జూలై 24 నుంచి 27 వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది.మొదటి రోజు నుంచి మల్టీప్లెక్స్‌లలో రూ.200, సింగిల్ స్క్రీన్లలో రూ.150 వరకు టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అలాగే జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.150, సింగిల్ స్క్రీన్లలో రూ.106 వరకు అదనంగా టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో బెనిఫిట్ షోలను రద్దు చేసినప్పటికీ, హరిహర వీరమల్లు కోసం మళ్లీ అనుమతి లభించడం విశేషం. జూలై 23న, విడుదలకు ముందు రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది. ఈ షోకు ఒక్క టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అదేవిధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్ ధర రూ.100, అప్పర్ క్లాస్ రూ.150 వరకు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు అదనంగా వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. 10 రోజులపాటు మాత్రమే ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…
BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…
ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్…
Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…
This website uses cookies.