Bigg Boss OTT : తెలుగు బిగ్‌ బాస్ ఓటీటీ గురించి 4 సూపర్‌ ఇంట్రెస్టింగ్ విషయాలు లీక్‌

Authored By Himanshi | The Telugu News | Published on: January 10, 2022, 10:30 am

Bigg Boss OTT : తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ ను సూపర్‌ హిట్ చేశారు. వీక్ డేస్ లో కాస్త లైట్ తీసుకున్నా వీకెండ్స్ మరియు స్పెషల్‌ ఎపిసోడ్స్ ను మాత్రం బిగ్ బాస్ ప్రేక్షకులు సూపర్‌ హిట్ చేస్తూనే ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యేందుకు గాను బిగ్ బాస్ నిర్వాహకులు ఓటీటీ ద్వారా బిగ్ బాస్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే హిందీ లో ఓటీటీ బిగ్ బాస్ వచ్చింది. కరణ్‌ జోహార్‌ హోస్ట్‌ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు లో కూడా ఓటీటీ బిగ్‌ బాస్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది.. దానికి కూడా నాగార్జున హోస్టింగ్ చేస్తాడని అంటున్నారు. అయితే ఫార్మట్‌ చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.

తెలుగు ఓటీటీ బిగ్ బాస్ ను చూసేందుకు ప్రేక్షకులు మరింత ఆసక్తితో ఎదురు చూడటం కు నాలుగు సూపర్‌ ఇంట్రెస్టింగ్‌ విషయాలు లీక్ అయ్యాయి. ఈ విషయాలు షో పై అంచనాలు పెంచడంతో పాటు ఎప్పుడెప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ చేస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. బిగ్‌ బాస్ ను సాదారణంగా టీవీ లో చూడటం అదే ఎపిసోడ్‌ ను హాట్‌ స్టార్ లో చూడటం తెలుగు ప్రేక్షకులకు తెలుసు. కాని బిగ్‌ బాస్ ను ఓటీటీ లో అది కూడా 24 గంటల పాటు కంటెస్టెంట్స్ ను చూసే అవకాశం ఉండటం ఖచ్చితంగా ప్రేక్షకులకు ఎగ్జైట్‌ మెంట్‌ ను కలిగిస్తుంది. ఇక ఈ ఓటీటీ కి సంబంధించిన మరో విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఓటీటీ బిగ్‌ బాస్ సీజన్‌ 1 కు ఓంకార్‌ దర్శకత్వం వహిస్తాడట.

telugu bigg boss ott leak interesting updates

telugu bigg boss ott leak interesting updates

Bigg Boss OTT : బిగ్ బాస్ తెలుగు ఓటీటీ హోస్ట్‌ గా ఓంకార్‌, కాని..!

కొన్ని ఎపిసోడ్స్ లో నాగార్జున మాత్రమే కాకుండా ఓంకార్ కూడా కనిపిస్తాడనే వార్తలు వస్తున్నాయి. అయితే అవి స్పెషల్‌ ఎపిసోడ్స్ అని వీకెండ్స్‌ లో మాత్రం నాగార్జున మాత్రమే వస్తాడు అన్నట్లుగా యూనిట్‌ సభ్యుల నుండి లీక్ వచ్చింది. ఇక ఫిబ్రవరి మూడవ ఆదివారం లేదా నాల్గవ ఆదివారంలో మాత్రమే ఈ షో ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో లీక్ ఏంటీ అంటే షో ను కరోనా థర్డ్‌ వేవ్‌ కాని మరేమైనా రాని ఖచ్చితంగా ఆపేదే లేదు అన్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఈ షో కు సంబంధించిన ఈ లీక్ లు ఓటీలో బిగ్ బాస్ ను ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్‌ చేస్తామా అన్నట్లుగా వెయిట్ చేసేలా చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp