Bigg Boss OTT Telugu : చాలెంజర్స్ టీమ్ ను కంట్రోల్ చేస్తున్న ఆర్జే చైతూ.. వారియర్స్ టీమ్ తోనే తిరుగుతున్న అజయ్
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ తెలుగులో గొడవలు స్టార్ట్ అయ్యాయి. హాట్ హాట్ గా ఉంటోంది హౌస్. ఏ ఒక్కరూ తగ్గడం లేదు. అస్సలు తగ్గడం లేదు. వారియర్స్, చాలెంజర్స్ అంటూ రెండు టీమ్స్ గా ఉండటం హౌస్ లో గొడవలకు ఆజ్యం పోసినట్టయింది.అందులోనూ ఒక టీమ్.. ఇప్పటికే బిగ్ బాస్ లో అనుభవం ఉన్న కంటెస్టెంట్లు కాగా.. చాలెంజర్స్ టీమ్ వాళ్లు కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు. అదే ఇప్పుడు పెద్ద సమస్య అయింది. కొత్త సభ్యులు ఏదో నేర్చుకోవడానికి వచ్చిన వాళ్లు కాగా.. ఇప్పటికే బిగ్ బాస్ లో అనుభవం ఉన్న వాళ్లు వారియర్స్ టీమ్ సభ్యులు కావడంతో..

ajay joins in warriers group and rj chaitu controlling challengers team
ఇదివరకు ఉన్న అనుభవంతో ఏదో చేద్దామని ఏదో చేయబోతున్నారు. అడ్డంగా చాలెంజర్స్ టీమ్ ముందు బుక్ అవుతున్నారు.చాలెంజర్స్ టీమ్ లో ఉన్న వాళ్లలో చాలా యాక్టివ్ గా ఉన్నది ఆర్జే చైతూ, యాంకర్ శివ. హౌస్ లోకి వచ్చిన కొత్తలో అజయ్ కాస్త హుషారుగా కనిపించినప్పటికీ.. ముమైత్ ఖాన్, అరియానా..
Bigg Boss OTT Telugu : అఖిల్ వెంటే తిరుగుతున్న అజయ్
ఇద్దరూ అజయ్ తో మాకు మంచి వైబ్స్ ఉన్నాయని చెప్పడం.. అఖిల్ కూడా అజయ్ తో క్లోజ్ గా మూవ్ అవడంతో.. అజయ్ పూర్తిగా వారియర్స్ టీమ్ లోకి చేరిపోయాడు.

ajay joins in warriers group and rj chaitu controlling challengers team
చాలెంజర్స్ టీమ్ ను వదిలేసి పూర్తిగా వారియర్స్ టీమ్ తోనే తిరుగుతున్నాడు. భవిష్యత్తులో అజయ్ కి చాలెంజర్స్ టీమ్ నుంచి మద్ధతు వస్తుందో రాదో మాత్రం తెలియదు. ఎందుకంటే.. చాలెంజర్స్ టీమ్ తో అజయ్ ఎక్కువగా తిరగకపోవడమే దానికి ప్రధాన కారణం.
మరోవైపు ఆర్జే చైతూ.. చాలెంజర్స్ టీమ్ ను కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. చాలెంజర్స్ టీమ్ మాత్రమే కాదు.. వారియర్స్ టీమ్ లోని కొందరు సభ్యులను కూడా చైతూ కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. చాలెంజర్స్ టీమ్ సభ్యులు మొత్తం చైతూ ఏది చెబితే అది చేసేలా కనిపిస్తున్నారు.

ajay joins in warriers group and rj chaitu controlling challengers team
ఇక వారియర్స్ టీమ్ లో అఖిల్ లీడర్ గా ఉన్నాడు. అఖిల్.. వారియర్స్ టీమ్ ను కంట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. చాలెంజర్స్ లో చైతూ.. వారియర్స్ టీమ్ లో అఖిల్.. ఇద్దరూ తమ టీమ్ లను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారా. మున్ముందు ఏం జరగబోతోంది.. తెలియాలంటే ఇంకా కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.