Pawan Kalyan : పవన్ కళ్యాన్ అడ్వాన్స్ లు.. అదే జరిగితే పరువు పోవడం ఖాయం
Pawan Kalyan : ఈమద్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా కూడా లాభాలు తెచ్చి పెట్టేది అతి తక్కువ శాతం మాత్రమే. అయినా కూడా నిర్మాతలు ఏదో సాదిద్దాం అన్నట్లుగా కాకుండా ఇండస్ట్రీ పై ఆసక్తితో సినిమాలు నిర్మిస్తున్నారు. అలాంటి నిర్మాతలు ముందు ముందు లేకుండా పోయే అవకాశం ఉంది. నిర్మాతలు లేకుంటే ఇండస్ట్రీ లేదు. అందుకే వారిని కాపాడుకోవాలి అంటూ ఇండస్ట్రీ ప్రముఖులు పలు సార్లు మాట్లాడిన విషయం తెల్సిందే. నిర్మాతలు కష్టాల్లో ఉంటే తన పారితోషికంను కూడా వెనక్కు ఇస్తాడు.
అంటూ గతంలో పవన్ కళ్యాన్ గురించి ప్రచారం ఉండేది. కాని ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరుకు నిర్మాతలు చిరాకు పడుతున్నారు. ఒక్కో నిర్మాత పదుల కోట్లు పవన్ మీద పెట్టి కూర్చున్నారు. వారు నెత్తి నోరు బాదుకున్నా కూడా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. హీరోగా సినిమాలు చేస్తానంటూ పలువురి వద్ద అడ్వాన్స్ లు తీసుకున్న పవన్ ఇప్పుడు బస్సు యాత్ర అంటూ మొదలు పెట్టబోతున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటీ అంటే కొత్తగా అడ్వాన్స్ ఇచ్చిన వారితో సినిమాకు ఆయన సిద్దం అవుతున్నాడు. చాలా కాలంగా హరి హర వీరమల్లు సినిమా మరియు భవదీయుడు భగత్ సింగ్ చిత్రాల గురించి వార్తలు వస్తున్నాయి.

telugu film producers angry on pawan kalyan due to his movie commitments
కాని ఇప్పటి వరకు ఆయన వాటిని పూర్తి చేయలేదు. భవదీయుడు సినిమా ను కనీసం మొదలు పెట్టలేదు. మైత్రి వారి నుండి దాదాపుగా 40 కోట్ల అడ్వాన్స్ ను తీసుకున్నాడట. వారికి రెండేళ్లుగా డేట్లు ఇవ్వడం లేదు. ఇంకా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కూడా పాతిక కోట్ల వరకు అడ్వాన్స్ ను ఇచ్చారట. ఇప్పుడు పవన్ ఆ అడ్వాన్స్ పరిస్థితి ఏంటీ అనేది చెప్పడం లేదట. దాంతో నిర్మాతలు ఏదో ఒక సమయంలో నిర్మాతల మండలిని ఆశ్రయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే జరిగితే పవన్ పరువు పోవడం ఖాయం అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.