Aswini : సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. ఒకవేళ స్టార్ గా ఎదిగిన దానిని చివరి వరకు కాపాడుకోవాలి. చాలామంది సెలబ్రిటీలు కెరియర్ ఆరంభంలో సక్సెస్ఫుల్గా లైఫ్ ను అనుభవించిన తర్వాత వ్యక్తిగతంగా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో చివరికి దీనస్థితిలో మరణిస్తున్నారు. మనకు తెలిసిందే మహానటి సావిత్రి స్టార్ హీరోయిన్గా ఎంత సక్సెస్ అయ్యారు వ్యక్తిగతంగా అంతే ఫెయిల్ అయ్యారు. చివరికి తాగుడుకు బానిసై దీనస్థితిలో మరణించారు. ఇక మరో తెలుగింటి హీరోయిన్ సుమారుగా 100కు పైగా సినిమాలలో నటించింది.
ఆఖరికి చికిత్సకు డబ్బులు లేక దీనస్థితిలో మరణించింది. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన నటి అశ్విని హీరోయిన్గా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళంలో కలుపుకొని 100కు పైగా సినిమాలలో నటించింది. తెలుగులో ‘ భక్త ధ్రువ మార్కండేయ ‘ అనే సినిమాలో బాలనటిగా కనిపించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా మారి వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, రాజేంద్ర ప్రసాద్‌తో స్టేషన్ మాస్టర్, రాజశేఖర్‌తో అమెరికా అబ్బాయి సినిమాలతో పాటూ చూపులు కలసిన శుభవేళ, అనాదిగా ఆడది వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.అయితే స్టార్ హీరోయిన్గా ఉన్న అశ్విని ఎవరికి తెలియకుండా ప్రేమ వివాహం చేసుకొని చిక్కుల్లో పడింది. పెళ్లి అయిన కొంతకాలానికి భర్త వదిలి వెళ్ళిపోవడంతో ఒంటరిగా కృంగిపోయింది.
తర్వాత కార్తీక్ అనే బాబును దత్తత తీసుకొని పెంచుకుంది. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు తగ్గిపోవడంతో సీరియల్స్ లో నటించింది. కొంతకాలానికి ఆమె అనారోగ్యానికి గురయ్యారు. అన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆమె పెద్దగా ఆస్తులను కూడబెట్టుకోలేదు. వైద్య చికిత్సల కోసం డబ్బులు లేక చెన్నైలో ఉన్న ఇల్లును అమ్మేసి అద్దె ఇంట్లో కాలం గడిపింది. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించి అశ్విని 2012లో మరణించింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.