Categories: NewsTechnology

Jio : జియో ప్లాన్ అదుర్స్ .. ఫ్యామిలీ మొత్తానికి ఒకటే ప్లాన్ .. కేవలం రూ.690 మాత్రమే ..!

Jio : ప్రస్తుతం ఇంట్లో ప్రతి ఒక్కరు మొబైల్ వినియోగిస్తున్నారు. దీంతో ఒక్క మనిషికి రీఛార్జ్ చేయాలంటే కనీసం 300 అవుతుంది. అంటే నలుగురికి 1200 అవుతుందా. అయితే జియో ఫ్యామిలీ మొత్తానికి ఒకటే ప్లాన్ ను తీసుకొచ్చిది. జియో ఫ్యామిలీ ప్లాన్స్ పేరుతో రెండు రీఛార్జ్ ప్లాన్స్ ని అందిస్తుంది. ఒకటి రూ. 399 నుంచి ప్రారంభమవుతుండగా, మరొకటి రూ. 699 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు ప్లాన్స్ లో నాలుగు చొప్పున మొత్తం 8 సబ్ ప్లాన్స్ ఉన్నాయి. రూ. 399 ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే ఒక ప్రైమరీ సిమ్ కార్డు వస్తుంది. నెలకు రూ. 399 అవుతుంది. 75 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ లో ఫ్యామిలీ మెంబర్స్ ని చేర్చుకోవడానికి అవ్వదు.

కుటుంబ సభ్యులని యాడ్ చేయాలంటే రూ. 498 ప్లాన్ ఉంది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ నంబర్ యాడ్ చేయడానికి అదనంగా రూ.99 అవుతుంది. అప్పుడు ఇద్దరికి నెలకి రూ. 249 చొప్పున అవుతుంది. 75 జీబీ డేటాతో పాటు అదనంగా 5 జీబీ డేటా వస్తుంది. ఒక ప్రైమరీ నంబర్ కి ఒక యాడ్ ఆన్ నంబర్ వస్తుంది. అదే ఒక ప్రైమరీ నంబర్ కి ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నంబర్స్ యాడ్ చేయాలంటే రూ.399 ప్లాన్ కి రూ.99 ప్లాన్స్ ని రెండు ఎంచుకోవాల్సి ఉంటుంది.

jio plan for family members

అప్పుడు ప్లాన్ విలువ 597 అవుతుంది. ఒక ప్రైమరీ నంబర్ కి మూడు యాడ్ ఆన్ నంబర్స్ యాడ్ చేయాలంటే రూ. 696 ప్లాన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రైమరీ నంబర్ కి రూ. 399, మిగతా మూడు నంబర్స్ కి రూ. 99 చొప్పున అవుతుంది. మొత్తం మీద ఈ ప్లాన్ తీసుకుంటే మనిషికి రూ. 174 పడుతుంది. డేటా ప్రైమరీ నంబర్ కి 75 జీబీతో పాటు మిగతా మూడు నంబర్స్ కి 5 జీబీ చొప్పున 15 జీబీ వస్తుంది. టోటల్ గా 90 జీబీ వస్తుంది. అన్ని ప్లాన్స్ లోనూ అన్ లిమిటెడ్ కాల్స్, అన్ లిమిటెడ్ 5జీ డేటా ఉచితంగా వస్తుంది. కాకపోతే ఇవి పోస్ట్ పెయిడ్ ప్లాన్స్.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

7 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

8 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

8 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

10 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

11 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

12 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

13 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

13 hours ago