Home » Entertainment » Thagubothu Ramesh Remuneration For Jabardasth Show
Entertainment

Thagubothu Ramesh : అయ్యో.. జబర్థస్త్ లో తాగుబోతు రమేష్ రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 4, 2022, 4:20 pm
Advertisement

Thagubothu Ramesh : జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చింది అనడం లో సందేహం లేదు. ఒకప్పుడు తిండి లేక రోడ్ల మీద తిరుగుతూ హోటల్స్ లో పని చేసిన వారు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. ఖరీదైన హోటల్స్ లో పార్టీ చేసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు స్టార్స్ గా వెలుగు వెలిగిన కొందరికి ఆ తర్వాత సినిమాల్లో స్థానం లేకుండా పోతే అదే జబర్దస్త్ ఆశ్రయం కల్పిస్తుంది. అందులో ముఖ్యులు తాగుబోతు రమేష్. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సుపరిచితుడు.. ఎన్నో వందల సినిమాల్లో ముఖ్య పాత్రలో నటించి మెప్పించాడు. తాగుబోతు రమేష్ ఒకానొక సమయంలో భారీ పారితోషకం తీసుకొని సినిమాల్లో నటించేవాడు.

Advertisement

కానీ మూస పాత్రలు రెగ్యులర్ గా అదే తరహా కామెడీ వల్ల అతడిని ప్రేక్షకులు తిరస్కరించడం మొదలు పెట్టారు. దాంతో సినిమాల్లో ఆఫర్స్ తగ్గాయి. సినిమాల్లో ఆఫర్స్ తగ్గిన వెంటనే తాగుబోతు రమేష్ తెలివిగా జబర్దస్త్ లో అడుగు పెట్టాడు. ఒకప్పుడు సినిమాల్లో తాగుబోతు రమేష్ తీసుకున్న పారితోషికం తో పోలిస్తే ప్రస్తుతం ఆయన జబర్దస్త్ కార్యక్రమానికి తీసుకుంటున్న పారితోషికం చాలా చాలా తక్కువ, అయినా కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా ప్రస్తుతానికి ఎంతో కొంత క్రేజీ ఉంది. కనుక ఆ క్రేజీ ని ఉపయోగించుకొని జబర్దస్త్ లో కొనసాగుతూ ఎంతో డబ్బు సంపాదించుకోవాలని తాగుబోతు రమేష్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాగుబోతు రమేష్ షో లో టీం లీడర్ కాదు మరో టీం లీడర్తో టీం పంచుకుంటున్నాడు, అందుకే ఆయన పారితోషికం చాలా తక్కువగా ఉంటుందని సమాచారం అందుతుంది.

Thagubothu Ramesh remuneration for jabardasth show

Advertisement

బుల్లితెర వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ కమెడియన్స్ లో చాలా మందికి ఇస్తున్న పారితోషకం కంటే తాగుబోతు రమేష్ కి మల్లెమాల వారి ఇస్తున్న పారితోషకం చాలా తక్కువ అంటూ తెలుస్తుంది. బుల్లితెర మరియు వెండితెర పై రాణిస్తూ నెట్టుకొస్తున్న తాగుబోతు రమేష్ ముందు ముందు మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వడానికి జబర్దస్త్ లో కొనసాగాలని భావిస్తున్నాడు. పారితోషికం కోసం కాకుండా సినిమాల్లో మళ్ళీ ఆఫర్స్ వస్తాయనే ఉద్దేశంతోనే తాను జబర్దస్త్ లో చేస్తున్నాను అంటూ సన్నిహితులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి జబర్దస్త్ లో చేస్తున్నందుకు ఇతర కార్యక్రమాల్లో అవకాశాలు వస్తాయి, అలాగే సినిమాల్లో కూడా ఛాన్స్ దక్కుతుంది అనే ఉద్దేశంతో తాగుబోతు రమేష్ చేస్తున్నాడట తప్ప భారీగా రెమ్యూనరేషన్ అయితే రావడం లేదని సమాచారం అందుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి