Nithya Menen : ఛీ వాడు మనిషేనా .. నిత్య మీనన్ ని దారుణంగా అవమానించిన స్టార్ హీరో !
Nithya Menen : హీరోయిన్ నిత్యామీనన్ Nithya Menen గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నాచురల్ స్టార్ నాని Nani సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కి పరిచయమైంది. నిత్యమీనన్ టాలీవుడ్ Tollywood లో ఎలాంటి గుర్తింపు ఉందో కోలీవుడ్ లో కూడా అంతే గుర్తింపు ఉంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన నిత్యామీనన్ టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. అనంతరం చాలామంది స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కొన్ని రోజులు హీరోయిన్ ఒక వెలుగు వెలిగింది. అలాంటిది అమ్మడు ఇటీవల అస్సలు కనిపించట్లేదు. పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రావడం లేదు.
అంతేకాదు పాత్ర డిమాండ్ చేయడం వల్ల లెస్బియన్ పాత్రలో సైతం నటించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసిన నిత్య ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా గ్లామర్ పాత్రలో నటించకుండా తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకుంది. ఇక అలాంటి నిత్యమీనన్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఒక హీరో తనని పొట్టి పొట్టి అంటూ అవమానిస్తూ ఉండే వాడట అయితే ఆ హీరో మరెవరో కాదు నాచురల్ స్టార్ నాని. మనకు తెలిసిందే వీరిద్దరూ కలిసి ‘ అలా మొదలైంది ‘ సినిమలో నటించారు.
అయితే ఒకసారి అందరి ముందు అలా పిలిచేసరికి అవమానంగా ఫీల్ అయిన నిత్యమీనన్ షూటింగ్ సెట్లో అందరూ చూస్తుండగానే బకెట్ నీళ్ళు తీసుకొచ్చి కోపంగా నాని పై పోసేసిందట. నిత్యామీనన్, నాని చేసిన హంగామాకి సెట్ లో ఉన్న వారంతా నవ్వుకున్నారట. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ చూడడానికి చాలా బాగుంటుంది. దీంతో అభిమానులు కూడా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని కోరుకుంటున్నారు. నాని, నిత్య కలిసి నటిస్తారో లేదో చూడాలి. లేకపోతే నిత్యామీనన్ కి టాలీవుడ్ ఎక్కువగా అవకాశాలు రావడం లేదు అనుకుంటా. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుంది కూడా ఎటువంటి అప్డేట్ లేదు.