Indraja About Her Marrriage in Latest Jabardasth Promo
Indraja : బుల్లితెరపై ప్రస్తుతం ఇంద్రజ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇంద్రజ మొత్తానికి రోజా స్థానాన్ని భర్తీ చేసేసింది. రోజాది కాస్త అతి అనిపించినా.. ఇంద్రజది మాత్రం ఎక్కడా కూడా అలా అనిపించదు. ఇంద్రజ ఎంతో న్యాచురల్‌గా మాట్లాడుతుంది.. అంతకంటే సహజంగా నవ్వుతుంది. ఇంద్రజకు రోజురోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. మొత్తానికి జబర్దస్త్ షోను ఇంద్రజ బాగానే నెట్టుకొస్తుంది. శ్రీదేవీ డ్రామా కంపెనీని ఇంద్రజ వదిలేసినా కూడా ఇక్కడ సెట్ అయింది. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో ఓ విషయం బయటకు వచ్చింది.
వెంకీ మంకీ మొదటి సారిగా తన టీంలోకి తన రియల్ భార్యను తీసుకొచ్చాడు.తన భార్యతో కలిసి స్కిట్లు వేశాడు. అనంతరం వారిద్దరి ప్రేమ కథను ఇంద్రజ అడిగింది. దీంతో స్టేజ్ మీద తన లవ్ స్టోరీని చెప్పేశాడు వెంకీ మంకీ. తాను మిమిక్రీ ఆర్టిస్ట్‌ని అని, ఆమె కూచిపూడి డ్యాన్సర్.. ముందు తానే ఆమెకు ప్రపోజ్ చేశానంటూ ఇలా చెప్పుకొచ్చాడు. అయితే అనంతరం అతని భార్య మోకాళ్ల మీద నిల్చుని, రోజా పువ్వు ఇచ్చి మరీ ప్రపోజ్ చేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే వెంకీ దొరికిందే చాన్స్ అనుకుని ఇంద్రజను కూడా అడిగేశాడు.
Indraja About Her Marrriage in Latest Jabardasth Promo
మీది లవ్ మ్యారేజా? మేడం అని అన్నాడు. ఇక ఇంద్రజ సిగ్గుపడుతూ అసలు విషయాన్ని చెప్పింది. తన పెళ్లికి కేవలం పదమూడు మంది మాత్రమే వచ్చారని, తన పెళ్లికి కేవలం రూ. 7500 మాత్రమే ఖర్చు అయిందని చెప్పుకొచ్చింది. సెలెబ్రిటీల పెళ్లిళ్లు అంటే ఎన్ని కోట్లు ఖర్చవుతాయో అందరికీ తెలిసిందే. కానీ ఇంద్రజ మాత్రం తన పెళ్లిని ఎంతో సింపుల్‌గా చేసేసుకుంది. అలా మొత్తానికి ఇంద్రజ తన పెళ్లి గురించి, దాని ఖర్చు గురించి చెప్పేసింది. ఇక అనసూయను ఇంద్రజ ఇలా అడిగింది. మరీ నీ పెళ్లి అని ఇంద్రజ అడగడంతో.. నాది అంతా కూడా తెరిచిన పుస్తకమే అని అనసూయ అనేసింది. ఎన్‌సీసీ క్యాంప్ లవ్ స్టోరీ, ఇంట్లోంచి బయటకు వెళ్లి పెళ్లి చేసుకోవడం, మళ్లీ ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం మరోసారి పెళ్లి చేయడం అందరికీ తెలిసిందే.
Jammu And Kashmir : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రస్తుతం భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయి.. సరిహద్దుల్లో కాల్పుల…
Vidadala Rajini : ప్రస్తుతం ఏపీలో వైసీపీ, కూటమి నాయకులకి అస్సలు పడడం లేదు. మరోవైపు పోలీసులు తమతో దురుసుగా…
Store Meat : మాంసం, చేపలు మరియు చికెన్ వివిధ రకాల రుచికరమైన పదార్ధాలలో చాలా ముఖ్యమైన పదార్థాలు. ప్రజలు…
Pawan kalyan : వీర జవాన్ మురళీ నాయక్ స్వగ్రామం కిళ్లితండాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు..…
Pomegranate : రోజూ ఒక దానిమ్మ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అతిగా చెప్పలేము. ఈ రత్నం…
Army Jawan : మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా పచోరా తాలూకాలోని పుంగావ్ గ్రామానికి చెందిన మనోజ్ పాటిల్.. భారత ఆర్మీలో…
Dates with Milk : పాలు రోజువారీ ఆహారంలో పోషకమైన పానీయంగా ప్రసిద్ధి చెందాయి. ఖర్జూరం అపారమైన పోషక విలువలు…
Venu Swamy : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట పాక గుండెల్లో గుబులు పుట్టిస్తోంది భారత్ లోని…
This website uses cookies.