the nagarjuna cupid heroine has changed now
Nagarjuna : అక్కినేని నాగార్జున కెరీర్‌లో ది బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే మన్మధుడు అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అమెరికాలో ఏకంగా 50 రోజులు ఆడిందని చాలా మందికి తెలియదు. కథ విషయానికొస్తే సింపుల్ లవ్ స్టోరీ అయినా కామెడీ మాత్రం అదిరిపోతుంది. దానికి తోడు నాగార్జు, బ్రహ్మానందం మధ్యలో సాగే పంచ్ డైలాగ్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తుంది. ఈ సినిమాలో నాగ్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. ఒకరు సోనాలి బింద్రే కాగా, మరో హీరోయిన్ అన్షు. ఈ అమ్మాయి ప్రభాస్‌తో రాఘవేంద్ర మూవీలోనూ కనిపించింది. ఆ తర్వాత మళ్లీ వెండితెరపై పెద్దగా కనిపించలేదు.
అన్షు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పాత్రల్లో నటించి అందరినీ మెప్పించింది. అన్షు పేరుతో ఎవరూ గుర్తుపట్టకపోయినా ఆమెను చూస్తే చాలు మన్మధుడు హీరోయిన్ అని అందరూ గుర్తుపెట్టుకుంటారు. అందులో ఆమె క్యారెక్టర్ అలాంటిది. ఆ సినిమా నటీనటులకే కాదు. చిత్ర యూనిట్ మొత్తానికి మంచి పేరు తీసుకొచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు డైలాగులు రాశాడు. కాగా, కె విజయ భాస్కర్ మన్మధుడు మూవీకి దర్శకత్వ వహించారు. 2002లో విడుదలైన తెలుగు చిత్రం కన్నడలో ఉపేంద్ర ప్రధాన పాత్రలో ఐశ్వర్యగా రీమేక్ చేయబడింది.
the nagarjuna cupid heroine has changed now
అయితే, అన్షు ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ నుండి అదృశ్యమైంది. ప్రశాంత్ (జీన్స్ ఫేమ్) నటించిన తమిళ చిత్రం జైలో పని చేసిన ఆమె.. చివరికు తన జన్మస్థలమైన లండన్‌కు తిరిగి వెళ్లి అక్కడ తన విద్యను అభ్యసించింది. ఆ తర్వాత సచిన్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని యూకేలో స్థిరపడింది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. అన్షు ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తోంది. ఆమె తన స్వంత డిజైనర్ లేబుల్ ఇన్‌స్పిరేషన్ కోచర్‌ని కూడా కలిగి ఉంది. ఇక మన్మధుడు సినిమాలో అన్షు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.