Deepthi Sunaina Shanmukh : బయటపడ్డ సంచలన విషయం.. షణ్ముక్, దీప్తి సునయన విడిపోవడానికి అసలు కారణం ఇదే..
Deepthi Sunaina Shanmukh : బిగ్‌బాస్ కంటస్టెంట్స్ షణ్ముక్, దీప్తి సునయన దాదాపుగా ఐదేండ్ల నుంచి లవ్‌లో ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగిసిన తర్వాత వీరు దూరమయ్యారు. దీంతో వారి ఫ్యాన్స్ గుండెలు పగిలాయి. అసలు కారణమేంటని అంతా ఆరా తీశారు. బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముక్, సిరి రొమాన్సే వారు విడిపోవడానికి కారణమని చాలా వార్తలు షికార్లు కొట్టాయి. వీరు విడిపోవడానికి సిరి కారణమంటూ చాలా మంది నుంచి కామెంట్స్ వచ్చాయి. కానీ దీప్తి, షణ్ముక్ విడిపోవడానికి వేరే కారణం ఉందంటా..
షణ్ముక్ కంటే ముందే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది దీప్తి. అప్పట్లో హీరో తనిష్ తో కలిసి ఫుల్ రొమాన్స్ చేసింది. వీరిని చూసిన వారంతా తనిష్, దీప్తి ప్రేమలో పడ్డారు అనేంతలా ఉండేది వీరి బిహేవియర్. దీని ముందు సిరి, షణ్ముక్ ల మధ్య కొనసాగిన ఎఫెక్షన్ తప్పేకాదనిపిస్తోంది. ఇక బిగ్ బాస్ హౌస్ పరిస్థితులు దీప్తికి తెలుసు కాబట్టి.. షణ్ముక్, సిరిని తప్పుబట్టాల్సిన అవసరమే లేదు. ఇన్ని రోజులు వీరిద్దరూ విడిపోవడానికి కారణం సిరి అంటూ చాలా మంది ఆమెను ట్రోల్స్ చేశారు. వాస్తవానికి జరిగింది ఏంటంటే..

the real reason why Deepthi Sunaina and Shanmukh split
Deepthi Sunaina Shanmukh : ఎందుకంత గోప్యంగా..
బిగ్‌బాస్ కంటే ముందు నుంచి వీరిద్దరు విడిపోదాం అనుకుంటున్నారట. బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన తర్వాత ఎలాగైన్ బ్రేకప్ అవ్వాలని ముందే నిర్ణయించుకున్నారట. అందుకే దీప్తిపై ఎలాంటి రూమర్స్ రాకుండా నిందను తనపై వేసుకున్నాడట షణ్ముక్. అందుకే హౌస్ లో సిరితో కలిసి అలా బిహేవ్ చేశాడని టాక్. ఇక బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత వీరిద్దరి లవ్ స్టోరీకి బ్రేకప్ పడింది. చివరకు వీరు విడిపోయారు. కానీ విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం గోప్యంగానే ఉంచారు. మరి ఆ విషయం ఏంటో తెలియాలంటే వారు రివీల్ చేసే వరకు వేచి చూడాల్సిందే.