Deepthi Sunaina Shanmukh : అందరి ముందు హగ్గులు, ముద్దులు.. షణ్ముఖ్ ఎవ్వారం ఏమి మారలేదుగా.. వీడియో !
Deepthi Sunaina Shanmukh : బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ షణ్ముఖ్ జస్వంత్ హౌజ్‌లో ఉన్నన్ని రోజులు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయన సిరితో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమెను కంట్రోల్‌లో పెట్టడం, ముద్దులు, హగ్గులు, ఒకే బెడ్ షెట్‌లో దూరడం ఇలా ఒకటేంటి చాలా చేశాడు. అయితే షణ్ముఖ్ చేసే చిలిపి పనులని దీప్తి చాలా ఓపికగా భరించింది. ఆయన హౌజ్ నుండి బయటకు వచ్చాక అతడికి బ్రేకప్ చెప్పింది. అప్పటి నుండి దీప్తి సునయన-షణ్ముఖ్‌ల బ్రేకప్ స్టోరి ఇప్పటికీ నెట్టింట హాట్ టాపిక్‌గానే ఉంది.చూడచక్కనైన ఈ జంట విడిపోతారని ఎవరూ ఊహించలేదు. బిగ్‌బాస్ షోలో ఎన్ని ట్రోల్స్ వచ్చినా షణ్నూకు చివరిదాకా అండగా నిలబడ్డ దీప్తి..
అతని జీవితంలో మాత్రం చివరివరకు ఉండలేకపోయింది. బిగ్‌బాస్ షో అయిన వెంటనే షణ్నూకి బ్రేకప్ చెప్పేసి సైడయిపోయింది.రీసెంట్‌గా తన తండ్రితో కలిసి ఓ వీడియోను షేర్ చేస్తూ… ‘ఆమె ఒంటరి కాదు. ఆమె వెనుక అత్యంత శక్తివంతమైన శక్తి ఉంది. అతడే తండ్రి ప్రేమ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం అత్యంత కష్టవంతమైన పరిస్థితులు ఎదురైనా తన తండ్రి ప్రేమతో దాన్ని జయిస్తానంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది.ఇదిలా ఉంటే దీప్తి-షణ్ముఖ్ ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ షోకి వెళ్లబోయే ముందు షణ్ముఖ్-దీప్తితో కలిసి మలుపు పేరుతో ఒక సిరీస్ చేశారు. ఈ సిరీస్ లోని ఓ సాంగ్ మేకింగ్ వీడియో యూట్యూబ్ లో విడుదల చేయగా అది వైరల్ గా మారింది.

Deepthi Sunaina Shanmukh New Video viral
Deepthi Sunaina Shanmukh : చనిపోయేటప్పుడు ప్లేస్ ఇవ్వమని అడుగుతుంది…
ఇందులో దీప్తి, షణ్ముఖ్ చాలా సరదాగా కనిపించారు. ఓ సీన్‌లో దీప్తి వచ్చి షణ్ముఖ్ ఎదపై పడుకుంది. దీంతో షణ్నూ ‘నేను చనిపోయేటప్పుడు కూడా దీప్తి ప్లేస్ ఇవ్వమని గొడవపడుతుంది, ఎందుకు జరగవని వాదిస్తుంది’ అని చెప్పడంతో దీప్తి నవ్వుతూ అతని ఎద పై వాలిపోయింది. మరో సన్నివేశంలో దీప్తి తెగ ముద్దులు పెట్టేశాడు షణ్ముఖ్. ఈ వీడియోపై నెటిజన్స్ తమకు నచ్చిన స్టైల్‌లో కామెంట్స్ పెడుతున్నారు.ఎవ్వారం ఏమి మారలేదుగా అన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు.
