Samantha : సమంత కి ఈ అరుదైన వ్యాధి రావడానికి కారణం ఇదే.. ప్రూఫ్ చూడండి..!
Samantha : ఒకప్పుడు ఎంతో చలాకీగా ఉండే సమంత కొద్ది రోజులుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. తాజాగా ఆమెకు మయోసైటిస్ వచ్చినట్టు పేర్కొంది. అయితే ప్రస్తుతం ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు చెప్పారంటూ సమంత చేసిన ట్వీట్ ఒక్కసారిగా అలజడి సృష్టించింది. సమంత ఎందుకు సడెన్‌గా ఇలా అనారోగ్యం బారిన పడిందని పలువురు ఆలోచనలు చేస్తున్నారు. ఒక్కోక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తున్నారు. సమంత ఈ వ్యాధి బారిన పడడానికి కారణం హెవీ వర్కవుట్స్ అని అంటున్నారు. వంద కేజీల వరకు ఆమె బరువులు మోసింది.
అంతేకాదు యశోద, వరుణ్ ధావన్ వెబ్ సిరీస్, ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం భారీ వర్కవుట్స్ చేసింది. ఆ వీడియోలు కూడా సామ్ పోస్టుచేసింది. విడాకుల తర్వాత డిప్రెషన్‌కి కూడా వెళ్లింది సమంత. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవన్నీ సమంత ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపించి ఉంటాయని అంటున్నారు. ఆటో ఇమ్యూన్ కారణంగా శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాల కలయికను మయోసైటిస్ అని పిలుస్తుంటారు. దీని వల్ల కండరాలు బలహీనంగా మారడమే కాకుండా త్వరగా అలసట రావడం, నొప్పి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరోవైపు సమంత యశొద సినిమాతో పాటు వరుణ్ ధావన్ సినిమా కోసం కూడా కొన్ని రిస్క్‌లు చేసింది. ఇవి కూడా తన ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపించి ఉంటాయని అంటున్నారు. తాజాగా యశోద సినిమాకి సంబంధించిన వీడియో విడుదలైంది. ఈ సినిమాలో డూప్ లేకుండా సమంత యాక్షన్ సీన్స్ చేశారు.

the reason why Samantha got this rare disease
Samantha : ఇది కూడా కారణమా?
సమంత నటించిన ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్.. ‘యశోద’ సినిమాకు పనిచేశారు. సమంత చేసిన యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియోను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. సమంత డెడికేషన్, సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ఈ వీడియోలో యానిక్ బెన్ మాట్లాడారు. ఆమెతో షూటింగ్ చేయడం బావుంటుంది. యాక్షన్ ఎప్పుడూ రియలిస్టిక్‌గా ఉండటం నాకు ఇష్టం. ‘యశోద’లో స్టంట్స్ కూడా రియలిస్టిక్‌గా ఉంటాయి. రియల్ లైఫ్‌లో ఎలా జరుగుతుందో… ‘యశోద’లో యాక్షన్ కూడా అలాగే రియలిస్టిక్‌గా ఉంటుంది. కిక్ బాక్సింగ్, జూడో, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ‘యశోద’ యాక్షన్ సీన్స్‌లో ఉంటాయి’’ అని బెన్ చెప్పారు. అయితే ఇందులో సమంత చాలా హార్డ్ వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. ఇది కూఆ సమంత అనారోగ్యం బారిన పడడానికి కూడా ఓ కారణంగా చెబుతున్నారు.