Suma- Rajeev : గెస్ట్ హౌజ్‌లో ఆ బ్యూటీ అలా చేసినందుకే సుమ‌- రాజీవ్‌ల మ‌ధ్య గొడ‌వ అయిందా?

Suma- Rajeev : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సుమ‌, రాజీవ్ క‌న‌కాల జంట గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చూడ ముచ్చ‌టగా ఉండే ఈ జంట‌ని చూసి అంద‌రు మురిసిపోయేవారు. అయితే క‌రోసా స‌మ‌యంలో ఈ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని, విడివిడిగా ఉంటున్నార‌ని చాలా హంగామా న‌డిచింది. ఈ క్ర‌మంలో సుమ ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఇద్దరి మధ్యలో గొడవలు వాస్తవమే.. ఈ 23 ఏళ్లలో ఎన్నో గొడవలు.. కానీ ఒకటి మాత్రం నిజం.. భార్యభర్తలుగా విడాకులు తీసుకోవడం సులభమే. కానీ తల్లిదండ్రులుగా చాలా కష్టమంటూ చెప్పుకొచ్చారు. అయితే గొడ‌వ వ‌ల‌న సుమ రాజీవ్ క‌న‌కాల విడాకులు కూడా తీసుకోవాల‌ని అనుకున్న‌ట్టు ప్ర‌చారం సాగ‌గా, ఈ ఇష్యూ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.

Advertisement

అయితే అస‌లు విడాకుల వ‌ర‌కు ఎందుకు వెళ్లాల‌ని అనుకున్నారంటే.. ఓ ఐటమ్ గర్ల్ అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. రాజీవ్ కనకాల తో ఆమె ఓ సినిమాలో నటించ‌గా, ఆ సినిమా పెద్దగా హిట్ కానప్పటికీ రాజీవ్ ఆ అమ్మాయి రొమాన్స్ ,కెమిస్ట్రీ బాగా కుదిరింది అని.. దీంతో గెస్ట్ హౌస్ లో కూడా వాళ్ళు తర్చూ రహస్యంగా మీట్ అయ్యే వారిని వార్తలు వినిపించాయి. అయితే ఓ సారి వీరిద్ద‌రు రెడ్ హ్యాండెడ‌గ్‌గా దొర‌క‌గా, ఈ విషయం తెలిసిన సుమ రూజీవ్‌ని దూరం పెట్టిన‌ట్టు ప్రచారం జ‌రిగింది. అయితే ప్రస్తుం గొడ‌వ‌ల‌న్నీ పోయి సుమ రాజీవ్ కనకాల హ్యాపీగా తమ పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement
the reason why suma and rajeev kanakala divorce
the reason why suma and rajeev kanakala divorce

Suma- Rajeev : ఆమె వ‌ల్ల‌నే అలా అయిందా..

సుమ తన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. రియాల్టీ షోస్ చేస్తూ టాప్ యాంకర్‏గా కొనసాగుతుంది. చాలా కాలం తర్వాత సుమ వెండితెరపై సందడి చేయబోతుంది. జయమ్మ పంచాయితీ సినిమాతో మరోసారి సినీ ప్రియులను అలరించింది.ఈ చిత్రానికి కలివరపు విజయ్ కుమార్ దర్శకత్వం వహించగా.. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై బలగ ప్రకాష్ నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్ లో తప్పకుండా సుమ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. అదేవిధంగా ఏ సినిమా ఈవెంట్ జరిగిన, ప్రీ రిలీజ్ వేడుక జరిగినా, అవార్డ్ ఫంక్షన్ జరిగినా అక్కడ తప్పనిసరిగా సుమ గొంతు వినపడాల్సిందే.

Advertisement