Anchor Suma : రాత్రైతే రాజీవ్ కనకాల పరిస్థితి అంతేనా?.. యాంకర్ సుమపై హీరో పంచ్ అదుర్స్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 10 October 2021, 5:59 pm

Anchor Suma : యాంకర్ సుమ పంచ్ వేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అవతల ఉన్నది ఎవ్వరన్నది ఆమెకు అక్కర్లేదు. ఆమె సెటైర్ వేస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అలా సుమతో అంత వీజీ కాదని అందరికీ తెలిసిందే. అయితే వచ్చే వారం క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో ఒకప్పటి హీరో హీరోయిన్లు వచ్చారు. నందమూరి తారకరత్న, వెంకట్, రేఖ, తనూ రాయ్ గెస్టులుగా రావడంతో సుమ వారిని ఓ ఆట ఆడుకుంది.

Hero Venkat Satires On Anchor Suma In Cash Show

Hero Venkat Satires On Anchor Suma In Cash Show

సుమ షోకు వెళ్తున్నారు.. జాగ్రత్త.. ఆమె అసలే ఎక్కువ పంచ్‌లు వేస్తుంది అని ముందే హెచ్చరించారు అని వెంకట్ సెటైర్ వేశాడు. అయితే తాను ఎక్కువగా లంగావోణిలు వేస్తున్నాను. పంచ్‌లు వేయడం లేదంటూ సుమ తిరిగి కౌంటర్ వేసింది. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు. ఇక వెంకట్ ఎక్కువగా రాజీవ్ కనకాల, సుమ దాంపత్య జీవితం మీదే కౌంటర్లు వేశాడు. ప్రస్తుతం పరిస్థితులు బాగా లేవు అని వెంకట్ చెబుతూ.. రాజీవ్‌ను కలిస్తే.. సుమను పెళ్లి చేసుకున్నాక పరిస్థితులు బాగా లేవు అని అన్నాడంటూ కౌంటర్ వేశాడు.

Anchor Suma : సుమపై హీరో పంచ్..

Hero Venkat Satires On Anchor Suma In Cash Show

Hero Venkat Satires On Anchor Suma In Cash Show

మరో సందర్భంలో సుమ ఓ ప్రశ్న అడిగింది. ఆడవాళ్ల కళ్లు ఏ సమయంలో పెద్దవి అవుతాయని అడిగింది. దానికి వెంకట్ వింత సమాధానం చెప్పాడు. 51శాతం పెద్దవి అవుతాయని వెంకట్ అంటే.. సుమ ఏదో చెప్పబోయింది. రాత్రి భర్త ఆలస్యంగా వస్తే.. భార్య కళ్లు 85 శాతం పెద్దవి అవుతాయ్ అని సుమ అనడంతో.. రాజీవ్ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవుతోందంటూ వెంకట్ కౌంటర్ వేశాడు. దీంతో సుమ దెబ్బకు నోరు మూసేసింది.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి