Home » Entertainment » The Star Heroine Kasthuri Who Saw Death Three Times What Actually Happened
Entertainment

Kasthuri: మూడు సార్లు చావును చూసిన స్టార్ హీరోయిన్..అసలేం జరిగిందంటే..?

Authored By
vamana sai
The Telugu News | Published on: August 12, 2021, 11:30 am
Advertisement

Kasthuri: మూడు సార్లు చావును చూశానని చెప్పింది సీనియర్ హీరోయిన్ కస్తూరి. ఆమె సినిమాలు ఠక్కున గుర్త్ రాకపోయినా ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఆమె సుపరిచితురాలే. ప్రముఖ ఛానల్ ‘స్టార్ మా’లో ప్రసారం అవుతున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకి బాగా దగ్గరైయ్యారు కస్తూరి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో చాలానే సినిమాలు చేసిన కస్తూరి అప్పట్లో బాగానే పాపులర్ అయ్యారు కస్తూరి. తెలుగులో అక్కినేని నాగార్జున నటించిన అన్నమయ్య వంటి సినిమాలతో కస్తూరి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

The star heroine kasthuri who saw death three times..what actually happened ..?

ఆ తర్వాత సినిమాలకి దూరమయ్యారు. ఇక నటిగా ఫేడవుట్ అయిందనుకున్న సమయంలో సీరియల్స్ తో తన సత్తా చాటుతున్నారు. ఈ సందర్భంగా కస్తూరి ఓ షోలో పాల్గొని ఆసక్తిరమైన విషయాలను చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఓం కార్ షో సిక్స్త్ సెన్స్‌లో ప్రేక్షకులతో పంచుకున్నారు కస్తూరి. తాను మూడుసార్లు చావుకు చాలా దగ్గరగా వెళ్లొచ్చినట్లు చెప్పి షాక్ కి గురి చేశారు. మొదటి రెండు సార్లు తన తల్లిదండ్రులు, మూడోసారి తన కూతురి రూపంలో చావుని చాలా దగ్గరగా చూసానని చెప్పారు.

Advertisement

Kasthuri: ఆ మూడేళ్ళలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను

Advertisement

కస్తూరికి కూతురు ఉంది. ఆమె లుకేమియా వ్యాధితో మూడేళ్లు బాధ పడిందని.. ఆ మూడేళ్ళ పాటు తాను నరకం చూసానని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ
సమయంలోనే తనకి కొడుకు కూడా పుట్టాడని.. ఆ బాబుకి మూడేళ్ల పాటు దూరం ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ సమయంలో చాలాసార్లు చచ్చి బతికానని కస్తూరి కన్నీరు పెట్టుకున్నారు. ఆ మూడేళ్లు తాను పడిన టెన్షన్ ఎవరికీ చెప్పుకోలేనని.. ఆ మూడేళ్ళలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. నాకు కారు, బంగ్లా, ఆస్తులు వంటివి ఏవీ అవసరం లేదు. నా కూతురులా లుకేమియాతో బాధ పడే పిల్లలకు సాయం చేయడానికి ఎంతైనా చేస్తానని పేర్కొన్నారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి