Home » Entertainment » Karthika Deepam Nirupam Paritala Funny Post 2
Entertainment

Karthika Deepam : ఏసేయండి ఏసేయండి అంటే నన్నే ఏసేశారు!!.. డాక్టర్ బాబు పరిస్థితి ఘోరం

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: August 13, 2021, 8:46 am
Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ అలియాస్ నిరుపమ్ పరిటాల సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. కార్తీకదీపం సీరియల్‌ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బాగానే ప్రమోట్ చేస్తుంటాడు. అక్కడి సీన్లకు, క్యాస్ట్యూమ్స్, పరిస్థితులకు తన దైన శైలిలో కౌంటర్లు వేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. ఇప్పుడు కార్తీకదీపం మంచి రసవత్తరంగా సాగుతోంది. మోనితకు ఏం జరిగిందో? ఎక్కడికిపోయిందో.. నిజంగానే చంపేశారా? అనే అనుమానాలు బాగానే తలెత్తుతున్నాయి.

Advertisement

Karthika Deepam Nirupam Paritala Funny Post

అయితే డాక్టర్ బాబు ఈ హత్య చేశాడంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. గన్ సౌండ్ వినబడింది కానీ కాల్చింది డాక్టర్ బాబు అని మాత్రం నేను చూడలేదు అంటూ భాగ్యం సాక్ష్యం చెప్పేసింది. అలా మొత్తానికి డాక్టర్ బాబును మాత్రం లోపలేశారు పోలీసులు. దీంతో డాక్టర్ బాబు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. తన ఈ పరిస్థితిపై డాక్టర్ బాబు కౌంటర్లు వేశాడు. ఆ మధ్య గన్నుతో పోజులు ఇస్తూ ఓ పోస్ట్ చేశాడు డాక్టర్ బాబు. మోనితను చంపేయండి అని నెటిజన్లు బాగా ఎంకరేజ్ చేశారు.

Advertisement

Karthika Deepam Nirupam Paritala Funny Post

ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ డాక్టర్ బాబు ఓ పోస్ట్ వేశాడు. గన్‌తో పిక్ పెడితే.. ఏసేయండి ఏసేయండి అన్నారు. ఇప్పుడు నన్ను ఏసేశారు. ఎవరు రెస్పాన్పిబుల్ అండి.. ఎవరు రెస్పాన్సిబుల్.. ఎవరు నన్ను బయటకు తీసేది అని అన్నాడు. దీంతో నెటిజన్లు పలు రకాలుగా కౌంటర్లు వేస్తున్నారు. సౌందర్య ఆంటీ ఉండగా మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరు.. మా దీపక్క వచ్చి బయటకు తెస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి డాక్టర్ బాబు మాత్రం మామూలోడు కాదు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==>  మొన్న సమంత, ఇప్పుడు కాజల్ అగర్వాల్..వీరికేం పనిలేదా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> జబర్దస్త్ షోలో కలర్‌ఫుల్‌ కమెడియన్ సత్యశ్రీ .. తనవల్లే జబర్దస్త్ లో వారందరికీ అవకాశాలు వచ్చాయి.

ఇది కూడా చ‌ద‌వండి ==> అందాల అక్సా ఖాన్ బర్త్ డే.. మెరిసిన జబర్దస్త్ శాంతి స్వరూప్

ఇది కూడా చ‌ద‌వండి ==> మూడు సార్లు చావును చూసిన స్టార్ హీరోయిన్..అసలేం జరిగిందంటే..?

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి