these are the top remuneration anchors in telugu
Anchors Remuneration : తెలుగులో చాలా మంది యాంకర్స్ మంచి పొజిషన్‌లో ఉన్నారు.వీరంతా తమ స్వయం కృషితో పైకి వచ్చిన వారే. అంచెలంచెలుగా ఎదరుగుతూ చాలా బాగా రాణిస్తున్నారు. వాస్తవానికి మగవాళ్లతో పోలిస్తే మహిళా యాంకర్సే ఎక్కువగా సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తెలుగులోని పలు చానెళ్లలో టాప్ యాంకర్స్‌గా రాణిస్తున్న వారి పేర్లు, తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ యాంకర్‌గా సుమ కనకాల కొనసాగుతున్నారు. ఈవిడ పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడటమే కాకుండా సినిమాల్లోనూ నటించగలదు. ఈమె ఇప్పటికీ ప్రతీ రోజూ వివిధ ఛానెల్స్‌లో రియాలిటీ షోస్‌కు తోడు ఆడియో ఫంక్షన్స్ కూడా చేస్తుంటుంది. ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ. 2 నుంచి రూ. 2.5 లక్షల వరకు తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. సుమ తర్వాతి స్థానంలో జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ సంపాదనలో నెంబర్ 2 స్థానంలో ఉంది.తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టడంలో అనసూయ ముందుంటుంది. ఈమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ.2 లక్షలు తీసుకుంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తోంది.
these are the top remuneration anchors in telugu
మరో జబర్దస్థ్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఈవెంట్స్ తో పాటు సినిమాలు చేస్తుంటుంది. ఈ భామ దాదాపు రూ.లక్షన్నరపైనే తీసుకుంటుందని టాక్. ఇక కార్తీక దీపంలో వంటలక్కగా మొన్నటివరకు కనిపించిన ప్రేమి విశ్వనాథ్ ప్రతి ఎపిసోడ్‌కు రూ.30 వేల రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఆ సీరియల్ సూపర్ హిట్ కావడంతో ఇపుడు రూ.50 వేలు తీసుకుంటున్నట్టు సమాచారం. మరో యాంకర్ శ్రీముఖి కూడా బాగానే సంపాదిస్తుంది. ఈమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ.లక్ష వరకు చార్జి చేస్తుందట.. ఈటీవీ యాంకర్ మంజూష కూడా ఒక్కో ఈవెంట్‌కు రూ.50 వేల వరకు వసూలు చేస్తుందనేది ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. యాంకర్ శ్యామల కూడా ఒక్కో ప్రోగ్రామ్‌కు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.