mega and Pawan Kalyan fans angry on Allu Aravind due to jalsa movie
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సమీపిస్తోంది. ఈ సమయంలో ఆయన నటించిన జల్సా మరియు తమ్ముడు సినిమాలను రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకోసం అభిమాన సంఘం నాయకులు ఆయా సినిమాల యొక్క నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. గతంలో వచ్చిన సినిమాలను ఇప్పుడు థియేటర్లో విడుదల చేయాలంటే 4కే సౌండ్ సిస్టం యాడ్ చేయడంతో పాటు కొంత టెక్నికల్ గా సినిమాను మార్చాల్సి ఉంటుంది. అందుకు నిర్మాతలు పాతిక నుండి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు జల్సా సినిమాకు అంత ఖర్చు చేసేందుకు తాము సిద్ధంగా లేము అంటూ అల్లు అరవింద్ చేతులు ఎత్తేసాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో జల్సా సినిమాతో భారీ లాభాలను దక్కించుకున్న అల్లు అరవింద్ ఇప్పుడు ఆ చిన్న మొత్తమును పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర సంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా స్క్రీనింగ్ చేయాలని భావించారు. కానీ అల్లు అరవింద్ నిర్ణయంతో ఇప్పుడు జల్సా సినిమా యొక్క స్క్రీనింగ్ డైలమాలో పడ్డట్లు అయ్యింది.
mega and Pawan Kalyan fans angry on Allu Aravind due to jalsa movie
హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ ఇలియానా జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన జల్సా సినిమా అల్లు అరవింద్ కి అప్పట్లో భారీ విజయాన్ని తెచ్చి పెట్టింది. దాదాపుగా పాతిక కోట్ల లాభాన్ని అల్లు అరవింద్ కు ఆ సినిమా తెచ్చి పెట్టింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు అల్లు అరవింద్ సినిమాను రిలీస్ చేసేందుకు సిద్ధంగా లేడని, అందుకు కారణం మళ్లీ ఖర్చు పెట్టాల్సి ఉండడమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే అల్లు అరవింద్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ సమాచారం అందుతుంది. ఈ విషయంలో అల్లు అరవింద్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
This website uses cookies.