Anchors Remuneration : తెలుగులో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్స్ ఎవరెవరంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchors Remuneration : తెలుగులో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్స్ ఎవరెవరంటే..?

 Authored By mallesh | The Telugu News | Updated on :28 August 2022,6:20 pm

Anchors Remuneration : తెలుగులో చాలా మంది యాంకర్స్ మంచి పొజిషన్‌లో ఉన్నారు.వీరంతా తమ స్వయం కృషితో పైకి వచ్చిన వారే. అంచెలంచెలుగా ఎదరుగుతూ చాలా బాగా రాణిస్తున్నారు. వాస్తవానికి మగవాళ్లతో పోలిస్తే మహిళా యాంకర్సే ఎక్కువగా సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తెలుగులోని పలు చానెళ్లలో టాప్ యాంకర్స్‌గా రాణిస్తున్న వారి పేర్లు, తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Anchors Remuneration : వేలల్లో నుంచి లక్షల్లో..

తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ యాంకర్‌గా సుమ కనకాల కొనసాగుతున్నారు. ఈవిడ పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడటమే కాకుండా సినిమాల్లోనూ నటించగలదు. ఈమె ఇప్ప‌టికీ ప్ర‌తీ రోజూ వివిధ ఛానెల్స్‌లో రియాలిటీ షోస్‌కు తోడు ఆడియో ఫంక్షన్స్ కూడా చేస్తుంటుంది. ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ. 2 నుంచి రూ. 2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. సుమ తర్వాతి స్థానంలో జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ సంపాదనలో నెంబర్ 2 స్థానంలో ఉంది.తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టడంలో అనసూయ ముందుంటుంది. ఈమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ.2 ల‌క్ష‌లు తీసుకుంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తోంది.

these are the top remuneration anchors in telugu

these are the top remuneration anchors in telugu

మ‌రో జ‌బ‌ర్ద‌స్థ్ యాంకర్ ర‌ష్మీ గౌత‌మ్‌ కూడా ఈవెంట్స్‌ తో పాటు సినిమాలు చేస్తుంటుంది. ఈ భామ దాదాపు రూ.ల‌క్ష‌న్న‌రపైనే తీసుకుంటుందని టాక్. ఇక కార్తీక దీపంలో వంటలక్కగా మొన్నటివరకు కనిపించిన ప్రేమి విశ్వనాథ్ ప్రతి ఎపిసోడ్‌కు రూ.30 వేల రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఆ సీరియల్ సూపర్ హిట్ కావడంతో ఇపుడు రూ.50 వేలు తీసుకుంటున్నట్టు సమాచారం. మరో యాంకర్ శ్రీముఖి కూడా బాగానే సంపాదిస్తుంది. ఈమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ.లక్ష వరకు చార్జి చేస్తుందట.. ఈటీవీ యాంకర్ మంజూష కూడా ఒక్కో ఈవెంట్‌కు రూ.50 వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తుంద‌నేది ఇండ‌స్ట్రీలో టాక్ నడుస్తోంది. యాంకర్ శ్యామల కూడా ఒక్కో ప్రోగ్రామ్‌కు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది