Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ షో ను వదులుకున్న సెలబ్రిటీలు వీళ్లే ..??
Bigg Boss 7 Telugu : బుల్లితెరపై మోస్ట్ పాపులారిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ షో ఎప్పుడు మొదలవుతుందో అని వెయ్యి కళ్ళతో వెయిట్ చేశారు. అయితే సెప్టెంబర్ 3న బిగ్బాస్ సీజన్ 7 గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ షో కి హోస్టుగా నాగార్జున వ్యవహరించారు. అయితే ఎప్పటినుంచో ఈ షోలో పాల్గొని కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ ఫుల్స్టాప్ పెడుతూ సెప్టెంబర్ 3న బిగ్బాస్ సీజన్ 7 గ్రాండ్ గా ఓపెన్ అయింది. అయితే ఈ షో నీ కొంతమంది సెలబ్రిటీలు వదులుకున్నారని టాక్. చాలామంది సెలబ్రిటీలు బిగ్బాస్ షో కి వెళ్లడానికి ఇష్టపడతారు.
ఈ షో ద్వారా జనాలకు మరింత దగ్గర కావచ్చు అని భావిస్తారు. అత్యంత ఆదరణ కలిగిన షో కావడంతో మరింత ఫేమస్ అవ్వచ్చు అది కెరియర్లో ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. అలాగే బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే 50 లక్షల నగదు తో పాటు విలువైన బహుమతులు కూడా వస్తాయి అందుకే ఈ షో కి అంత క్రేజ్. ఈ షోలో ఛాన్స్ రావాలని చాలామంది ప్రయత్నిస్తారు. కానీ కొందరు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటారు. కొందరు అనుకోని సంఘటనలతో ఆ షో కు వెళ్లలేదు. మరికొందరు బేరం కుదరక ఆగిపోయారు. జబర్దస్త్ కమెడియన్, నటుడు మహేష్ ఆచంట, మొగలిరేకులు ఫేమ్ సాగర్ లకు ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేశారట.
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ షో ను వదులుకున్న సెలబ్రిటీలు వీళ్లే ..??
అలాగే యువ సామ్రాట్, యూట్యూబర్ అనిల్ గీలాలకు చివరి నిమిషంలో ఛాన్స్ చేజారినట్లు సమాచారం. ఎంపికయ్యాక చివర్లో తనకు హ్యాండ్ ఇచ్చారని అనిల్ బాధపడ్డాడు. ఇక జబర్దస్త్ నరేష్ సైతం ఈ సీజన్లో పాల్గొనాల్సి ఉంది. జబర్దస్త్ షో అగ్రిమెంట్ బ్రేక్ చేసి షోకి వెళ్లేందుకు అతడు ఆసక్తి చూపలేదట. అలాగే ఆస్ట్రేలియాలో ఓ షో చేయాల్సి ఉండగా అది కూడా బిగ్ బాస్ షోను రిజెక్ట్ చేయడానికి కారణం అంటున్నారు. సీరియల్ నటి పూజా మూర్తి చివరి నిమిషంలో తప్పుకుంది తన తండ్రి హఠాత్ మరణం చెందడంతో ఆ ఛాన్స్ ను వదులుకుంది. మరో సెలబ్రిటీ అంజలి పవన్ కూడా రెమ్యూనరేషన్ విషయంలో వెనక్కి తగ్గినట్లు టాక్.
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
This website uses cookies.