Sri Krishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ తిధి ఎప్పుడు 2023న శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది.? శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఎలాంటి పూజ చేసుకోవాలి. నైవేద్యాలు ఏం పెట్టాలి.. ఇలాంటి విశేషాలు అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం.. రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి, రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీ కృష్ణ జయంతి, శ్రీ జయంతి ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యపిండి లేదా ముగ్గుతో బాలగోపాలుడు పాదాలను తీర్చిదిద్దడంతో పండగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు వివిధ పువ్వులతో తోరణాలు కట్టి కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో సుప్రపరిచి చందనం కుంకుమలతో అలంకరించి చక్కగా విగ్రహాన్ని పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి.
అక్షింతలు, ధూప దీపాలతో పూజించుకోవాలి. పాయసం, వడపప్పు, చక్ర పొంగలి ఇలాంటి ప్రసాదాలతో పాటుగా సొంటి బెల్లంతో చేసిన పానకం, వెన్న, మిగడ, పాలు నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పించాలి. కృష్ణుడికి ఈ పర్వదినం రోజున బెల్లం కలిపి ఆటుకులను పూజలో తప్పకుండా ఉంచాలి. అప్పుడు లక్ష్మీప్రదంగా మనకి ఏవైతే లోటుగా అనిపిస్తాయో మన జీవితంలో అవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ అటుకులు తీసుకుని మనకు ఆ లోటును పూరిస్తాడు. మరి 2023వ సంవత్సరంలో శ్రీ కృష్ణాష్టమి ఎప్పుడు వచ్చింది. అంటే సెప్టెంబర్ 7వ తేదీన శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలి.
అయితే మధ్యాహ్నం పూట ఈ శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలని అనాదిగా వస్తున్న ఆచారం. శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. కాబట్టి కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి అభ్యంగా స్నానం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు గడపకు పసుపు, కుంకుమలు పూజ గదిలో ముగ్గులు అది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణ మీ ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కూడా కృష్ణుని పాదాలను భిన్నంగా కృష్ణాష్టమి పూజలు మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించాలి.
వీలైతే ఆ సమయానికి పూజ సాగేలా చూసుకోవాలి. ఇక కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి పూజలో తులసీదళాన్ని తప్పకుండా వాడాలి. ఆయన ప్రతిమ కూడా తులసిమాలతో అలంకరించుకోవాలి మన ఇంట్లో మనిషిగా జరుపుకుంటూ ఉంటారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.