Pawan Kalyan : వాటికి పవన్ కళ్యాణ్‌కు అసలు సంబంధం లేదా..?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమా ఏమంటూ మొదలుపెట్టారో గానీ, సరిగ్గా షూటింగ్ జరగలేదు. కరోనా కాకుండా ఇతర కారణాల వల్ల 15 నెలలు షూటింగ్ ఆగిపోయింది. అదే సమయంలో కోటికి పైగా ఖర్చు చేసి వేసిన భారీ సెట్ కూలిపోయి అదో నష్టం. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల తర్వాత పవన్ కెరీర్‌లో రూపొందుతున్న త్యంత భారీ చిత్రం ఇదే. అంతేకాదు, పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్
ఇండియా సినిమా కావడం విశేషం.దర్శకుడు క్రిష్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు.
మూడు విభిన్నమైన పాత్రలలో ముప్పై రకాల కాస్ట్యూంస్..ఇలా పవన్ పాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో ఆయన బందిపోటు దొంగగా కనిపిస్తారని టాక్. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం దాదాపు రూ 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి షూటింగ్ మొదలైన ఈ సినిమాకు సంబంధించి తాజాగా మళ్ళీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన టాకీ పార్ట్ రష్ చూసి పవన్ కళ్యాణ్ చాలా అసంతృప్తితో ఉన్నారని దాంతో ఇప్పుడు చేయాల్సిన షూటింగ్‌ను పవన్ క్యాన్సిల్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే, అవన్నీ కేవలం కల్పించిన వార్తలేనట.

They have no real connection to Pawan Kalyan
Pawan Kalyan : పవన్ పాత్ర సినిమాకు మెయిన్ హైలెట్..
ఈ మూవీ విషయంలో పవర్ స్టార్ చాలా నమ్మకంగా ఉన్నట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. మొదటిసారి ఈ మూవీ కోసం భారీ స్థాయిలో శ్రమిస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్ ఉన్న వీరమల్లు మూవీ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని మరీ నటిస్తున్నారు. పవన్ పాత్ర సినిమాకు మెయిన్ హైలెట్ అని ఇప్పటికే దర్శక, నిర్మాతలు చెప్పారు. కాబట్టి, ఈ మూవీకి సంబంధించి వస్తున్న వార్తలకు పవన్‌కు ఏ మాత్రం సంబంధం లేదని తెలుస్తోంది. కాగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలలో కనిపించబోతున్న ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీత దర్శకుడు. జూన్ మొదటి వారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలవబోతోందని సమాచారం.