this happened before Super Star Krishna death
Super Star Krishna : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15 మరణించిన సంగతి తెలిసిందే. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆయన ఈ లోకాన్ని విడిచారు. కృష్ణ మరణంతో యావత్ తెలుగు పరిశ్రమనే కాదు, ఇండియన్‌సినిమా ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి చెందారు. ఇరు రాష్ట్రాల సీఎంలు, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, అఖిల్, మోహన్‌బాబుతో పాటు పలువురు ప్రముఖులు కృష్ణకి నివాళులు అర్పించారు. ఇక మహేష్ తన బాధను దిగమింగుకొని నవంబర్ 21న తన తండ్రి అస్థికలను కృష్ణా నదిలో కలిపాడు.
కృష్ణ అస్థికలు కృష్ణా నదిలో నిమజ్జనం చేసిన మహేష్ బాబు వెంటనే హైద్రాబాద్‌కు వెళ్లారు. సెప్టెంబర్‌లో మహేష్ అమ్మ ఇందిర మరణించారు. అమ్మ అస్థికలు గంగానదిలో కలిపి కనీసం నెల కూడా అయిందో లేదో.. ఇప్పుడు ఇలా నాన్న కృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపారు మహేష్ బాబు. కృష్ణ అంత్యక్రియలను ఫాంహౌస్ లో నిర్వహించకుండా మహాప్రస్థానంలో నిర్వహించడంపై సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ రాగా, దీనిపై ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు వివరణ ఇచ్చారు. కృష్ణ సతీమణి ఇందిరాదేవికి జరిగిన అంత్యక్రియలను నిర్వహించిన చోటే కృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించడంతో అలా చేసామని ఆదిశేషగిరి రావు అన్నారు.
this happened before Super Star Krishna death
ఇక కృష్ణ మరణం ముందు రోజు ఏం జరిగిందో కూడా ఆయన చెప్పుకొచ్చారు. అన్నయ్య నైట్ వరకు చాలా యాక్టివ్‌గానే ఉన్నారు. నన్ను అక్కడ భోజనం చేయమన్నా కూడా నేను వేరే పని వల్ల వచ్చేశా. అయితే అన్నయ్యకు కేర్ టేకర్‌గా ఉన్న వ్యక్తి పల్స్ చెక్ చేసినప్పుడు ఎర్రర్ రావడంతో నాకు కాల్ చేశాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకురమ్మని చెప్పాను. హార్ట్ స్ట్రోక్ వచ్చిన 20 నిమిషాలలోపు ఆసుపత్రికి వెళితే ఫలితం ఉండేది. కాని ఆలస్యం కావడంతో మేము ఎంత ప్రయత్నించిన కూడా అన్నయ్యని దక్కించుకోలేకపోయం అని ఆదిశేషగిరి రావు అన్నారు. అన్నయ్యను కాదు నేను మంచి స్నేహితుడిని కూడా కోల్పోయానంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.