New Car : చాలామందికి కారు కొనాలనుకునే కోరిక ఉంటుంది. ఎప్పటికైనా కారుని కొనుగోలు చేయాలని ఆశపడుతుంటారు. అయితే కార్లు కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఎందుకంటే ప్రస్తుతం కార్ల మీద పండుగ సీజన్ ఆఫర్లు దసరా, దీపావళి అంటూ ఆఫర్లు వస్తున్నాయి. కంపెనీ ఇచ్చే డిస్కౌంట్లు, డీలర్లు ఇచ్చే అదనపు ప్రయోజనాలు ఇలా చాలా లాభాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడూ ఉండే ఆఫర్లే కదా అని అనుకుంటున్నారేమో ఎందుకంటే మీరు ఇప్పుడు కారును కొన లేకపోతే ముందు నాటికి అది మరింతగా భారం కావచ్చు అని నిపుణులు అంటున్నారు. కారును ఇప్పుడు కాకపోతే వచ్చే రోజుల్లో కొనడం ఇంకా కాస్ట్లీగా మారనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అన్ని కంపెనీలకు చెందిన కొత్త కారుల ధరలు త్వరలోనే మరింతగా పెరగనున్నట్లు తెలుస్తుంది.
వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి అన్ని కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. అయితే ఇది కంపెనీల లాభాల కోసం పెంచుతున్నవి కాదు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల దృష్ట్యా ఈ ధరలు పెరగనున్నాయి. వచ్చే సంవత్సరం నుంచి కర్బన ఉద్గారాల నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది. ప్రస్తుతం కొత్త కార్లు అన్ని బిఎస్-6 కార్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం నుంచి బిఎస్ 6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా కార్లను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనల అమలులో కంపెనీలు అలసత్వం ప్రదర్శించకూడదు. ప్రస్తుతం కంపెనీలు అన్నీ ఈ బిఎస్-6 స్టేజ్ 2 నిబంధన విషయంలో పనిచేస్తున్నాయి. ఒకసారి కంపెనీలు అందుకు అనుగుణంగా కార్లను తయారు చేయడం ప్రారంభించాక కార్ల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.
కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలకు కంపెనీలు మారెందుకు కార్ల ఇంజన్ డిజైన్లు మార్పులు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా కారు యొక్క సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్లని మార్పులు చేయాలి. అందుకు తగినట్లుగా కంపెనీలు ఇప్పటికే తమ పనులను ప్రారంభించాయి. బీఎస్-6 స్టేజ్ 2 కార్లలో కర్బన ఉద్గారాల మానిటరింగ్ కోసం కొంత ఎక్విప్మెంట్ సాఫ్ట్ వేర్ ని ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. అవి కారు నుంచి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను పర్యవేక్షిస్తుంటుంది. కారు నుంచి ఎక్కువగా కార్బన్ ఉద్గారాలు రిలీజ్ అవుతూ ఉంటే కారు సర్వీసింగ్ చేయించాలని మీకు హెచ్చరికను కూడా ఇస్తుంది. బిఎస్ 4 నుంచి బిఎస్ 6 కి మారినప్పుడు ఎలా అయితే కార్ల ధరలు పెరిగాయో అలాగే ఇప్పుడు బిఎస్ 6 నుంచి బిఎస్ 6 స్టేజ్ 2 కి మారినప్పుడు కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కొత్త కారు కొనుగోలు చేయాలనికునేవారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.