
Venkatesh : వెంకటేష్ యంగ్ హీరోలకి పోటీగా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. కరోనా క్రైసిస్ లో కూడా వెంకీ మూడు సినిమాలను పూర్తి చేయడం గొప్ప విషయం. వెంకీ నుంచి ఆ 3 సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో రెండు సినిమాలు రీమేక్ సినిమాలు. తమిళంలో యంగ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమాని వెంకటేష్ తెలుగులో ‘నారప్ప’ టైటిల్‌తో రీమేక్ చేశాడు. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో వెంకీ సరసన ప్రియమణి నటించింది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించాడు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
three movies from venkatesh…ready for 75 one
అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ చేస్తున్నాడు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా దర్శకుడికి కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్‌కి బ్రేక్ పడింది. కాగా ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌లో వెంకటేష్ నటిసున్న సంగతి తెలిసిందే. మీనా.. వెంకీకి జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన జీతు జోసెఫ్ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన వెంకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. 50 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం విశేషం.
ఇలా నారప్ప, ఎఫ్ 3, ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్ సినిమాలతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న వెంకటేష్ తన కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ 75 కి కథా చర్చలు.. దర్శకుడి గురించి చర్చలు మొదలయ్యాయి. వెంకటేష్ తన 75వ సినిమాని ఏ దర్శకుడితో చేస్తే బావుంటుందన్న ఆలోచనలో ఉన్న సురేష్ బాబు త్రివిక్రమ్ అయితే అన్నీ విధాలా బావుంటుందన్న నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ వాస్తవంగా ఎన్.టి,ఆర్ తో సినిమా చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది. దాంతో నెక్స్ట్ సినిమాని మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నాడు. మరి త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా వెంకీ 75 లేక మహేష్‌తోనా అన్నది త్వరలో క్లారిటీ రానుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.