KTR : మొన్ననే నాగార్జునసాగర్ ఉపఎన్నిక ముగిసింది. మళ్లీ పురపాలక పోరు మొదలైంది తెలంగాణలో. రెండు గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ పురపాలక ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. వరంగల్, ఖమ్మం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు… సిద్ధిపేట, కొత్తూరు, అచ్చంపేట, నకిరెకల్, జడ్చర్లలో మునిసిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో కూడా ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ మిగితా పార్టీల కంటే ముందుగానే అడుగులు వేస్తోంది. నోటిఫికేషన్ వెలువడగానే వెంటనే పార్టీ రంగంలోకి దిగి… ఆయా మునిసిపాలిటీల్లో ఇన్ చార్జ్ లను నియమించింది. ఈనెల 30 న పురపాలక పోరు జరగనున్న నేపథ్యంలో… వెంటనే ఇన్ చార్జ్ లు కూడా ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.అయితే… ఈ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. ఆయన పురపాలక ఎన్నికల్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు.
చివరకు మునిసిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కావాలని ఆయన తప్పుకున్నారా? లేక మంత్రి కేటీఆర్ ను ఇన్వాల్వ్ చేయలేదా? అనే విషయంపై క్లారిటీ లేకున్నప్పటికీ…. మొత్తం పురపాలక ఎన్నికల అభ్యర్థుల ఎంపికతో పాటు.. ప్రచార బాధ్యతలను కూడా మంత్రి హరీశ్ రావుకు అప్పగించిందట అధిష్ఠానం. సీఎం కేసీఆరే మంత్రి హరీశ్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు ఊహాగాలనులు వెలువడుతున్నాయి. అయితే… మంత్రి కేటీఆర్ ను కాదని హరీశ్ రావుకు…. కేసీఆర్ ఎందుకు పురపాలక ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు అనేది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.
అయితే.. ఇటీవల మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే…. మంత్రి కేటీఆర్.. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విస్తృతంగా పర్యటించారు. వరంగల్ కూడా వెళ్లారు. అన్ని ప్రాంతాల్లో తిరిగి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అన్ని ప్రాంతాల్లో తిరిగినప్పటికీ… కేటీఆర్ సిద్ధిపేటకు మాత్రం వెళ్లలేదు. దీంతో అసలు ఏం జరుగుతోంది అనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు.
మొత్తానికి ఈ పురపాలక ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూరంగా ఉండబోతున్నారు. ఇక ఎన్నికలు జరగబోయే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు పార్టీ అధిష్ఠానం ఇన్ చార్జ్ లను నియమించింది. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మంకు పువ్వాడ అజయ్, సిద్ధిపేటకు హరీశ్ రావు, కొత్తూరుకు శ్రీనివాస్ గౌడ్, అచ్చంపేటకు నిరంజన్ రెడ్డి, నకిరేకల్ కు జగదీశ్ రెడ్డి, జడ్చర్లకు లక్ష్మారెడ్డి ఇన్ చార్జ్ లుగా ఉండనున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.