Venkatesh : వెంకటేష్ నుంచి మూడు సినిమాలు..75 వ సినిమాకి సన్నాహాలు..!

Advertisement

Venkatesh : వెంకటేష్ యంగ్ హీరోలకి పోటీగా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. కరోనా క్రైసిస్ లో కూడా వెంకీ మూడు సినిమాలను పూర్తి చేయడం గొప్ప విషయం. వెంకీ నుంచి ఆ 3 సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో రెండు సినిమాలు రీమేక్ సినిమాలు. తమిళంలో యంగ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమాని వెంకటేష్ తెలుగులో ‘నారప్ప’ టైటిల్‌తో రీమేక్ చేశాడు. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో వెంకీ సరసన ప్రియమణి నటించింది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించాడు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
three movies from venkatesh...ready for 75 one
three movies from venkatesh…ready for 75 one

అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ చేస్తున్నాడు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా దర్శకుడికి కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్‌కి బ్రేక్ పడింది. కాగా ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌లో వెంకటేష్ నటిసున్న సంగతి తెలిసిందే. మీనా.. వెంకీకి జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన జీతు జోసెఫ్ తెలుగు రీమేక్‌ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన వెంకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. 50 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం విశేషం.

Advertisement

Venkatesh : వెంకటేష్ తన 75వ సినిమా..త్రివిక్రమ్ తో సంప్రదింపులు..?

ఇలా నారప్ప, ఎఫ్ 3, ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌ సినిమాలతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న వెంకటేష్ తన కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ 75 కి కథా చర్చలు.. దర్శకుడి గురించి చర్చలు మొదలయ్యాయి. వెంకటేష్ తన 75వ సినిమాని ఏ దర్శకుడితో చేస్తే బావుంటుందన్న ఆలోచనలో ఉన్న సురేష్ బాబు త్రివిక్రమ్ అయితే అన్నీ విధాలా బావుంటుందన్న నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ వాస్తవంగా ఎన్.టి,ఆర్ తో సినిమా చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది. దాంతో నెక్స్ట్ సినిమాని మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నాడు. మరి త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా వెంకీ 75 లేక మహేష్‌తోనా అన్నది త్వరలో క్లారిటీ రానుంది.

Advertisement
Advertisement