
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్.. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ – హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ చేసుకొని మార్చ్ వరకు ఫ్రీ కాబోతున్న ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా కోసం మేకోవర్ అవుతాడని సమాచారం. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా గా త్రివిక్రమ్ యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించబోతున్నాడు.
అరవింద సమేత వీర రాఘవ వచ్చి భారీ కమర్షియల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ని ఈ సినిమాలో త్రివిక్రమ్ చాలా పవర్ ఫుల్ గా చూపించాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ లకి మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు తెరకెక్కబోతున్న లేటెస్ట్ సినిమా మీద ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇక ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ కూడా దక్కించుకోబోతున్నాడు కాబట్టి త్రివిక్రమ్ సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడు.. కథ ఎలాంటిది.. అన్న చర్చలు సాగుతున్నాయి.
కాగా నిన్నా మొన్నటి వరకు ఈ సినిమాకి అయినను పోయిరావలే హస్తినకు అన్న టైటిల్ ప్రచారంలో ఉండగా తాజాగా “చౌడప్ప నాయుడు” అన్న టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ ని బట్టి మళ్ళీ ఫ్యాక్షన్ సినిమానే అని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే నే హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. దాదాపు పూజా హెగ్డే ఫైనల్ అయిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరొక హీరోయిన్ గా రష్మిక మందన్న లేదా బాలీవుడ్ బ్యూటీని తీసుకు వచ్చే ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళేందుకు రంగం సిద్దం అవుతోంది.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.