Home » Entertainment » Trivikram Funny Speech At Ala Vaikunthapurramullo Reunion
Entertainment

అబ్బాయిలకు చెప్పను అంటే.. త్రివిక్రమ్ మాటల వెనుక అర్థమేంటి?

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 12, 2021, 10:55 pm
Advertisement

అల వైకుంఠపురములో సృష్టించిన రికార్డులు, బాక్సాఫీస్ కలెక్షన్లు అన్నీ ఇ న్నీ కావు. ఇక సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో బన్నీ నిజంగానే మనస్ఫూర్తిగా సంతృప్తి చెందినట్టున్నాడు. అల వైకుంఠపురములో సినిమా విడుదలై నేటికి ఏడాది అవుతోంది. ఈ క్రమంలో టీం మొత్తం రీయూనియన్ పార్టీ పెట్టేసింది. ఈ ఈవెంట్‌లో త్రివిక్రమ్ స్పీచ్ హైలెట్ అయింది. ఎన్నో విషయాల గురించి చెప్పేశాడు.

Advertisement

అబ్బాయిలకు చెప్పను అంటే.. త్రివిక్రమ్ మాటల వెనుక అర్థమేంటి?

ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుంటే వారి ఇంటికి వెళ్తే పెళ్లి ఆల్బమ్‌ను చూపిస్తు ఎంత గొప్పగా చెబుతుంటారు.. అలాగే ఈ సినిమాకు మాకు పెళ్లి ఆల్బమ్ లాంటిదే.. ప్రతీసారి మీకు చెబుతూనే ఉంటాం.. మీరు వింటూనే ఉండాలి.. మేం వదిలిని జెమినీ చానెల్ వాళ్లు వదిలిపెట్టరు… ఇది మరో అతడు.. వాళ్లు వేస్తూనే ఉంటారు.. అంటూ త్రివిక్రమ్ తన స్పీచ్‌ను మొత్తంగా అలా ఉత్సాహంగానే మాట్లాడాడు.

Advertisement

మధ్యలో సముద్రఖని గురించి మాట్లాడాడు. చిన్న పాత్రే అయినా కూడా నా మీదున్న ప్రేమతో వచ్చి చేశాడంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. సిత్తరాల సిరపడు అనే పాటలో అద్భుతంగా చేశారు లవ్యూ అంటూ సముద్రఖనిని పొగిడేశాడు. సాధారణంగా మగవారికి ఆ మాటలను చెప్పను కానీ మీకు చెబుతున్నా అంటూ స్టేజ్ మీద నవ్వులు పూయించాడు త్రివిక్రమ్. అంటే త్రివిక్రమ్ ఆడవాళ్లలో చాలా మందికే ఐలవ్యూ చెప్పాడా? అంటూ కొంటె కామెంట్లుచేస్తున్నారు. ఇక చివర్లో బన్నీ కూడా త్రివిక్రమ్ దారిలో వెళ్తూ.. తాను కూడా అబ్బాయిలకు ఐలవ్యూ చెప్పను కానీ త్రివిక్రమ్‌కు చెబుతాను అని చెప్పేశాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి