Home » Entertainment » Tiktok Durgarao Monthly Salary
Entertainment

Tiktok Durgarao : టిక్ టాక్ దుర్గారావు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: July 22, 2021 8:38 am
Advertisement

Tiktok Durgarao : టిక్ టాక్ దుర్గారావు.. ఈ పేరు చెబితే చాలు.. ముఖం మీద నవ్వు రావాల్సిందే. ఎందుకంటే.. ఎటువంటి సపోర్ట్ లేకుండా.. కేవలం టిక్ టాక్ లో ఫన్నీ వీడియోలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు టిక్ టాక్ దుర్గారావు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఫేమస్ అయింది. టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత వీళ్లు ఇంకా ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ల వీడియోలే. టిక్ టాక్ దుర్గారావు అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ. ఒకప్పుడు సాధారణ జీవితం గడిపిన టిక్ టాక్ దుర్గారావు ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయారు. సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.

Advertisement

tiktok durgarao monthly salary

టిక్ టాక్ బ్యాన్ అయ్యాక కూడా తనకు ఫేమ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా పెరిగింది. దుర్గారావు, ఆయన భార్య ఇద్దరూ ఫన్నీ వీడియోలు చేస్తూ ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియాలో టిక్ టాక్ దుర్గారావుకు ఉన్న ఫాలోయింగ్ మామూల్ది కాదు. మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన సంపాదన కూడా పెరిగింది. అయితే.. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. టిక్ టాక్ దుర్గారావు ఎలా ఉండేవాడంటే.. తను వ్యవసాయం చేస్తూ ఫ్యామిలీని పోషించేవాడు. తనకు వ్యవసాయం ఉంది. ఇప్పటికీ దుర్గారావు వ్యవసాయం చేస్తున్నారు. వీడియోలు చేస్తూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏదైనా సినిమాల్లో ఆఫర్ వస్తే.. హైదరాబాద్ కు వచ్చి షూటింగ్ అయిపోయేంత వరకు ఉండి.. మళ్లీ తన ఊరికి వెళ్లిపోతాడు.

Advertisement

tiktok durgarao monthly salary

Tiktok Durgarao : నా పిల్లలను చదివించే స్థోమత కూడా నాకు లేదు

టిక్ టాక్ దుర్గారావుకు వీడియోల మీద పెద్దగా డబ్బేమి రాదట. కానీ.. ఏదైనా సినిమాల్లో ఆఫర్ వస్తే.. సినిమాలో పాత్ర చేస్తే అంతో ఇంతో పారితోషకం ఇస్తారట. దుర్గారావు ప్రస్తుతం తన ఊళ్లో ఓ వ్యక్తి వద్ద పనిచేస్తున్నారట. ఆయనకు నెలకు 10 వేల రూపాయలు ఇస్తారట. అయితే.. 10 వేల రూపాయలతో తన పిల్లలను చదివించుకునే స్థోమత దుర్గారావుకు లేదట. దీంతో ఆయనే పిల్లల చదువుల కోసం సంవత్సరానికి లక్షన్నర రూపాయలు ఫీజు కోసం ఇస్తారట.

Advertisement

ఇదే టిక్ టాక్ దుర్గారావు సంపాదించే సంపాదన. అందరూ అనుకుంటున్నట్టు.. దుర్గారావు.. నెలకు లక్షలకు లక్షలు సంపాదించడం లేదు. ఏదైనా సినిమా ఆఫర్ వచ్చినా.. టీవీ షోలో ఆఫర్ వచ్చినా.. వాళ్లు అంతో ఇంతో పారితోషకం ఇస్తారట. అంతే.. కానీ టిక్ టాక్ దుర్గారావుకు కోట్ల రూపాయల విలువ చేసే కారు ఉంది.. విమానం ఉంది.. సొంత ఫ్లాట్ ఉంది.. అనేది అంటా పుకారు మాత్రమేనని దుర్గారావు ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> రోజుకు 36 వేలు… అత్త‌కు బాయ్ ఫ్రెండ్ కావాల‌ట‌.. కోడ‌లు ప్ర‌క‌ట‌న‌… సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఏరా ర‌వి… విష్ణుప్రియ ఓవర్ యాక్ష‌న్‌.. స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన యాంక‌ర్ ర‌వి…!

ఇది కూడా చ‌ద‌వండి ==> రక్తాన్ని కళ్లచూడని పండుగను చేసుకోండి.. బక్రీద్‌పై యాంకర్ రష్మీ కామెంట్స్ వైర‌ల్‌..!

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> ప్రైవేట్ పార్టీలో రెచ్చిపోయిన సమంత.. వైరల్ ఫోటో

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి